గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రామ్‌నాథ్ కోవింద్

Subscribe to Oneindia Telugu

పాట్నా: ఎన్డీయే ప్రభుత్వ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో బీహార్‌ గవర్నర్‌ పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదించారు.

'రాష్ట్రపతి'గా రామ్‌నాథ్ కోవిందే ఎందుకు?: ఆయన ప్రత్యేకత ఏంటి?

కాగా, కోవింద్‌ స్థానంలో పశ్చిమబెంగాల్ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠికి అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు బెంగాల్‌ గవర్నర్‌ త్రిపాఠి బీహార్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నట్లు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది.

Ram Nath Kovind resigns as Bihar Governor, Tripathi gets additional charge

రాష్ట్రపతి ఎన్నికలపై గత కొంతకాలంగా ఏర్పడిన సిందిగ్ధతకు తెర దించుతూ.. రామ్‌నాథ్‌ కోవింద్‌ను తమ అభ్యర్థిగా ఎన్డీయే సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 23న కోవింద్‌ తన నామినేషన్‌ వేయనున్నారు.

కోవింద్‌ అభ్యర్థిత్వానికి ప్రతిపక్షాలు మద్దతు తెలిపితే.. ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. లేదంటే జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. జులై 20న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికైతే ప్రతిపక్షాలు తాము మరో అభ్యర్థిని బరిలో దించుతామని ప్రకటించాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After Ram Nath Kovind was nominated as NDA's Presidential candidate, West Bengal Governor Keshari Nath Tripathi has been given additional charge as Bihar Governor.
Please Wait while comments are loading...