సెక్స్ స్యాండల్ ఎఫెక్ట్, త్వరలో సీఎం, హోం మంత్రి సీడీలు విడుదల ?, బాంబు పేల్చిన జారకిహోళి !
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్ లీక్ కేసు కర్ణాటకతో సహ దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. గోకాక్ సాహుకారు, మాజీ మంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజే బాంబు పేల్చారు. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి రమేష్ జారకిహోళి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హోం మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ కు చెందిన ఇలాంటి సీడీలు త్వరలో విడుదల కావచ్చు అంటూ బాంబు పేల్చారు.
సీఎం సిద్దరామయ్య, కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ సీడీల గురించి ఆ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రమేష్ జారకిహోళి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంతో ఆ రాష్ట్రంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఆడియో కూడా ఉందని, నా అశ్లీల సీడీ విడుదల కేసులో కూడా డీకే శివకుమార్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని, అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని రమేష్ జారకిహోళి ఆరోపించారు.

ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు ఇప్పుడు విడుదల అయ్యాయని, త్వరలో సీఎం సిద్ధరామయ్య, హొం మంత్రి పరమేశ్వర సీడీలు కూడా బయటకు రావచ్చు అని, తాను మొదటి నుంచి ఇలాంటి సీడీలు విడుదల విషయంలో డీకే శివకుమార్ హస్తం ఉందని పదే పదే చెబితే అందరూ ఉపేక్షించారని, తన మాటలు విని ఆ రోజు నవ్వుకున్నారని రమేష్ జారికిహోళి ఆరోపించారు. అయితే ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ సీడీల విడుదల వెనుక డీకే శివకుమార్ హస్తం ఉందని రమేష్ జారికిహోళి ఆరోపించారు.
ఏదో ఒకరోజు సీఎం సిద్దరామయ్య, హొం మంత్రి పరమేశ్వర్ సీడీలను కూడా డీకే శివకుమార్ విడుదల చేస్తారని, ఆ రోజు నేను చెప్పింది నిజం అని అందరూ నమ్ముతారని రమేష్ జారికిహోళి అన్నారు. దయచేసి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్ వీలైనంత త్వరగా ఈ విషయం గురించి క్షుణ్ణంగా ఆలోచించాలని, పార్టీలకు అతీతంగా నేను చెప్పిన విషయం గురించి ఆలోచించాలని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రామేష్ జారికిహోళి సిద్దరామయ్యకు మనవి చేశారు.

ప్రజ్వల్ రేవణ్ణ కేసులో డీకే శివకుమార్ ఆడియో విడుదల గురించి మాట్లాడుతూ ప్రజ్వల్ రేవణ్ణ కేసు విషయంలో డీకే శివకుమార్ పరోక్షంగా, నా సీడీ విడుదల విషయంలో డీకే శివకుమార్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని రమేష్ జారకిహోళి ఆరోపించారు. నా దగ్గర సాక్షలు ఉన్నాయని మీడియా ముందు చెప్పానని, సీబీఐకి వాంగ్మూలం ఇస్తానని, నా కేసులో సిట్ పై నమ్మకం లేదని రమేష్ జారికిహోళి ఆరోపించారు.












Click it and Unblock the Notifications