వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరా బాబా: ఖైదీ నెంబర్ 1997, శిక్షను తగ్గించలేమన్న కోర్టు, సిర్సాలో ఉద్రిక్తత

By Narsimha
|
Google Oneindia TeluguNews

రోహతక్: 15 ఏళ్లనాటి అత్యాచార కేసులో రాక్‌స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు కోర్టు 20 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధించింది. రెండు వేర్వేరు కేసుల్లో పదేళ్ల చొప్పున రామ్ రహీమ్ బాబాకు 20 ఏళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.ఈ శిక్షపై గుర్మీత్‌బాబాకు హైకోర్టును ఆశ్రయించనున్నారు.

డేరాబాబా: విలాస జీవితం, రాజకీయ అండ, నటనపై ఆసక్తిడేరాబాబా: విలాస జీవితం, రాజకీయ అండ, నటనపై ఆసక్తి

20 ఏళ్ల పాటు బాబాకు శిక్ష పడినట్టు బాబా తరపు లాయర్ మీడియాకు తెలిపారు. రెండు కేసుల్లో పదేళ్లు చొప్పున మొత్తం 20 ఏళ్లు విధించినట్టు లాయర్ ఎస్‌కే నర్వన తెలిపారు.

రాజస్థాన్‌కు పాకిన అల్లర్లు,31 మంది మృతి, ఖట్టర్‌పై వేటు?రాజస్థాన్‌కు పాకిన అల్లర్లు,31 మంది మృతి, ఖట్టర్‌పై వేటు?

అంతేకాక ఒక్కో కేసులో రూ.15 లక్షలు చొప్పున రెండు కేసుల్లో మొత్తం రూ.30 లక్షల జరిమానా విధించిందని ఆయన చెప్పారు.

బాధితులు ఇద్దరికి చెరో రూ.14 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పినట్టు లాయర్ వివరించారు. ఇప్పటి వరకు పదేళ్లు జైలు మాత్రమే అనుకుంటున్న బాబా అనుచరులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.

డేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులుడేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులు

డేరాబాబా తనకు అడ్డుచెప్పేవారిని కిరాతకంగా అడ్డు తొలగించుకొనేవాడనే ప్రచారం ఉంది. బాబా ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యపై బాబాపైనే అనుమానాలు ఉన్నాయి.

జైలు శిక్షపై హైకోర్టులో సవాల్

జైలు శిక్షపై హైకోర్టులో సవాల్

అత్యాచారం కేసులో రామ్ రహీమ్ బాబాపై సిబిఐ కోర్టు 20 ఏళ్ళ పాటు విధించిన శిక్షను హైకోర్టులో సవాల్ చేస్తామని బాబా తరపు న్యాయవాదులు ప్రకటించారు. ఈ కేసులో సీబీఐ సమగ్ర దర్యాప్తు చేయలేదని, సరైన సాక్ష్యాలు కూడా లేవని వారు తెలిపారు. అంతే కాకుండా బాబా సామాజిక సేవను కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో బాబాకు హైకోర్టు న్యాయం చేస్తుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని రామ్ రహీమ్ బాబా తరపు న్యాయవాదులు ప్రకటించారు.

డేరా బాబా ఖైదీ నెంబర్ 1997

డేరా బాబా ఖైదీ నెంబర్ 1997

సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు నేపథ్యంలో రామ్ రహీమ్ బాబాను రోహ్‌తక్ జైలుకు తరలించారు. జైలులో ఆయనకు 1997 నెంబర్‌ను కేటాయించారు.ఇంతకాలంపాటు రంగు రంగుల దుస్తులు వేసుకొన్న రామ్‌రహీమ్ బాబా జైలు దుస్తులను వేసుకొన్నారు.గుర్మీత్‌ను సాధారణ ఖైదీగా చూడాలని కోర్టు ఆదేశించింది. విఐపీ తరహలో గుర్మీత్‌కు సౌకర్యాలను కల్పించడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 శిక్షను తగ్గించలేమన్న న్యాయమూర్తి

శిక్షను తగ్గించలేమన్న న్యాయమూర్తి

డేరా బాబా పేదలకు చేసిన సేవలను గుర్తించి ఆయనకు శిక్షను తగ్గించాలని గుర్మిత్ తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఏళ్ళ తరబడి పేదల కోసం బాబా చేసిన సేవలను న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే ఈ విషయమై న్యాయమూర్తి విబేధించారు. డేరాబాబా చేసిన నేరాలు క్షమించరానివని అభిప్రాయపడ్డారు. క్షమించరాని నేరం చేసినా పేదలకు సేవలను చూపి కొంత తగ్గించేందుకు డేరా బాబా న్యాయమూర్తులు ప్రయత్నించారు. కానీ, కోర్టు మాత్రం అంగీకరించలేదు.

బాబా అకృత్యాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు

బాబా అకృత్యాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు

డేరా సచ్ఛా సౌదా చీఫ్‌, రాక్ స్టార్ బాబాగా పేరొందిన గుర్మీత్‌ రాం రహీమ్‌ సింగ్‌ సమాజానికి శత్రువని, ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని అన్షుల్‌ ఛత్రపతి వ్యాఖ్యానించారు. అన్షుల్ ఛత్రపతి గుర్మీత్ రేప్ కేసును వెలుగులోకి తెచ్చిన సిర్సా జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి తనయుడు. గుర్మీత్ దారుణాలను వెలుగులోకి తెచ్చినందుకు 2002 అక్టోబర్ 24న రామ్ చందర్ ఛత్రపతిని అత్యంత సమీపం నుంచి ఆయన ఇంటి వద్ద దుండగులు కాల్చి చంపారు. అనంతరం గుర్మీత్ చేసిన లైంగిక వేధింపులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని 10 నవంబర్ 2003లో హైకోర్టు సీబీఐని ఆదేశించింది.దీంతో దర్యాప్తు జరిపిన సీబీఐ సాక్ష్యాలు అందజేయడంతో లైంగిక వేధింపుల కేసులో గుర్మీత్‌ కు ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది. రామ్ చందర్ ఛత్రపతి హత్యపై సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ 2005 జనవరిలో పంజాబ్, హర్యానా హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో వాదనలు సెప్టెంబర్ 16న జరగనున్నాయి. ఈ వాదనలను లైంగిక వేధింపుల కేసులో గుర్మీత్ కు శిక్ష విధించిన న్యాయమూర్తి జస్టిస్ జగదీప్ సింగ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అన్షుల్ స్పందించారు. గుర్మీత్ కు న్యాయస్థానం సరైన శిక్ష విధించిందని తెలిపారు.

డేరా బాబాకు శిక్ష ఖరారు... భగ్గుమన్న సిర్సా...

డేరా బాబాకు శిక్ష ఖరారు... భగ్గుమన్న సిర్సా...

వివాదాస్పద గురువు డేరా బాబా గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ళపాటు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో సిర్సాలో ఆందోళనకారులు బీభత్సం సృష్టిస్తున్నారు. గుర్మీత్ ప్రధాన ఆశ్రమంలోనూ బాబా అనుచరులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. డేరా అనుచరులు రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. వాహనాలకు నిప్పుపెట్టిన సంగతి తెలియగానే డేరా చైర్ పర్సన్ విపస్సన ఇన్సాన్ స్పందించారు. అనుచరులంతా శాంతించాలని కోరారు.ముందస్తు జాగ్రత్తగా సునరియ జైలు వెలుపల మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. డేరా బాబా అనుచరులు జైలు వద్ద గుమిగూడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హర్యానా, పంజాబ్‌, ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించి కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

English summary
Rape convict Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh was on Monday sentenced to 20 years in jail by a special CBI court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X