రేవ్ పార్టీ భగ్నం: 27మంది యువతీయువకులు అరెస్ట్
జైపూర్: రాజస్థాన్ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ప్రముఖ డ్యాన్సర్ గులాబో సపేరా ఫాంహౌజ్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీలో 27మంది యువతీయువకులను అరెస్ట్ చేశారు. వీరిలో విదేశీ మహిళ కూడా ఉంది. ఆమె ఫిన్లాండ్ దేశస్తురాలిగా గుర్తించారు.
గులాబో కుమారుడు భవానీ సపేరాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్, మద్యం సేవించిన యువతీయువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.

తాను తన ఫ్రెండ్ పుట్టిన రోజు కావడంతో తాను బయటికి వెళ్లానని చెప్పిన గులాబో, తన కొడుకు భవానీకి ఏ విదేశీ మహిళా తెలియదని చెప్పారు.
తన ఫాంహౌజ్‌లో ఓ దేవాలయాన్ని కూడా నిర్మించాలనని తెలిపారు. అలాంటి ప్రదేశంలో తన కొడుకు రేవ్ పార్టీ ఎలా నిర్వహిస్తారని గులాబో ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications