Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్యాంకులను బకరా చేసిన టాప్ టెన్ కంపెనీలు..

సామాన్యులెవరైనా ఒక లక్ష రూపాయల రుణాన్ని చెల్లించకపోతే నానా హంగామా చేసి ముక్కు పిండి మరీ వసూలు చేసే బ్యాంకులు.. ఏళ్ళ తరబడి వేల కోట్ల రుణాన్ని చెల్లించడంలో జాప్యం చేస్తూ చివరాఖరికి చేతులెత్తేసే బడాబాబుల పట్ల మాత్రం ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తుంటాయి. తాజాగా తెరపైకి వచ్చిన విజయ్ మాల్యాతో పాటు ఇదే కోవలో పయనిస్తున్న కంపెనీల జాబితా పెద్దదిగానే ఉంది.

విషయంపై ఆరా తీసిన సుప్రీంకోర్టు 500 కోట్లకు పైగా రుణాల్ని తీసుకుని ఎగవేతకు పాల్పడుతున్న వారి జాబితాను సమర్పించాల్సిందిగా ఆర్.బీ.ఐ ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఆర్.బీ.ఐ ఆ వివరాలను అందించింది. అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం గోప్యంగా ఉంచాలని ఆర్.బీ.ఐ కోరడం గమనార్హం. కాగా.. "న్యూస్ లాండ్రీ" ద్వారా తాజాగా కొన్ని కంపెనీల పేర్లు బయటపడడం విశేషం. లాండ్రీ ద్వారా బయటపెట్టిన జాబితాలోని కంపెనీలన్నీ 1000 కోట్లకు పైగా ఎగవేతకు పాల్పడ్డవే. మొత్తంగా ఆయా కంపెనీలన్నీ ఎగవేపిన మొత్తం అక్షరాల రూ.5లక్షల కోట్లు.

RBI Defaulters List: The Rs 5 lakh crore secret

న్యూస్ లాండ్రీ బయటపెట్టిన టాప్ టెన్ ఎగవేత కంపెనీలు ఇవే :

1. ఉషా ఇస్పాత్ రూ.16911 కోట్లు

2. లాయిడ్ స్టీల్ రూ.09478 కోట్లు

3. హిందుస్థాన్ కేబుల్స్ రూ.04917 కోట్లు

4. హిందుస్థాన్ ఫోటో ఫిలింస్ రూ.03929 కోట్లు

5. జూమ్ డెవలపర్స్ రూ.03843 కోట్లు

6. ప్రకాష్ ఇండస్ట్రీస్ రూ.03665 కోట్లు

7. క్రేన్స్ సాఫ్ట్ వేర్ రూ.03580 కోట్లు

8. ప్రాగ్ బాస్మీ సింథటిక్స్ రూ.03558 కోట్లు

9. కింగ్ ఫిషర్ రూ.03259 కోట్లు

10. మాళవిక స్టీల్ రూ.03057 కోట్లు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+