వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: త్వరలోనే రూ.2 వేల నోట్లు వెనక్కి, నిజమేనంటున్న ఎస్‌బీఐ రిపోర్ట్..

రూ. 2000 నోట్లను రద్దు చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ.. అవి పుకార్లుగానే పరిగణించడం జరిగింది. తాజాగా ఎస్‌బిఐ ఈకో ప్లాష్ రీసెర్ఛ్ రిపోర్టు ప్రకారం.. ఆ వార్త నిజమేనని స్పష్టమవుతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ. 2000 నోట్లను రద్దు చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ.. అవి పుకార్లుగానే పరిగణించడం జరిగింది. కానీ.. తాజాగా ఎస్‌బిఐ ఈకో ప్లాష్ రీసెర్ఛ్ రిపోర్టు ప్రకారం.. ఆ వార్త నిజమేనని స్పష్టమవుతోంది.

రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన తరువాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటికంటే పెద్దదైన రూ. 2000 నోటును చలామణిలోకి తెచ్చింది. అయితే ఇప్పుడు ఆ నోటును కూడా రద్దు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

2000-rupees-notes

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను వెనక్కి తీసుకోవడంగానీ, నోట్ల ముద్రణను ఆపేయడం గానీ చేసే అవకాశం ఉన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది.
ఇటీవల లోక్‌సభలో ఆర్బీఐ వార్షిక నివేదిక సమర్పించింది.

ఆ నివేదిక ప్రకారం.. నోట్ల రద్దు ప్రకటన మొదలుకొని మార్చి 2017 వరకు చిన్న కరెన్సీ నోట్ల పంపిణీని పెంచినట్లు గుర్తించామని, వీటి విలువ రూ. 3,501 బిలియన్లు అని ఎస్‌బిఐ ఈకో ప్లాష్ నివేదిక తెలిపింది. అదేవిధంగా డిసెంబర్ 8 వరకు చెలామణి అయిన పెద్దనోట్ల విలువ రూ. 13,324 బిలియన్లుగా ఉందని వెల్లడించింది.

ఆ తరువాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో సమర్పించిన నివేదిక ప్రకారం.. డిసెంబర్ 8 వరకు ఆర్‌బిఐ 16,957 మిలియన్ల రూ. 500 నోట్లను, 3,654 మిలియన్ల రూ. 2000 నోట్లను ముద్రించింది. వీటి మొత్తం విలు 15,787 బిలియన్లు ఉంటుంది.

అయితే ప్రింట్ అయిన నోట్ల విలువ రూ. 15,787 బిలియన్లుకాగా అందులో చెలామణిలోకి వచ్చిన నోట్ల విలువ రూ.13,324 బిలియన్లు. దీనిని బట్టి చూస్తే.. రూ. 2,463 బిలియన్ల విలువైన రూ. 2000 నోట్లను ఆర్బిఐ ముద్రించింది కానీ.. వాటిని మార్కెట్లోకి విడుదల చేయలేదని స్పష్టమవుతోందని ఎస్‌బీఐ ఎకనామిక్ అడ్వైజర్ గ్రూప్ చీఫ్ సౌమ్యకాంతి ఘోష్ పేర్కొన్నారు.

దీన్నిబట్టి ఆర్బీఐ క్రమక్రమంగా పెద్దనోట్ల చలామణిని తగ్గిస్తోందని స్పష్టమవుతోందని రిపోర్ట్ తెలిపింది. పెద్దనోట్లకు ప్రత్యామ్నాయంగా ఆర్బీఐ చిన్ననోట్ల ముద్రణపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోందని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది.

English summary
The Reserve Bank of India (RBI) may either be holding back Rs. 2,000 notes or could have stopped printing high denomination currency, says a SBI Research report. Juxtaposing the data presented in the Lok Sabha recently with the one provided by RBI in its Annual Report earlier, the SBI Ecoflash report said today, "we observe" that the value of small denomination currency in circulation up to March 2017 was Rs. 3,501 billion. This implies that the value of high denomination notes was equivalent to Rs. 13,324 billion as on December 8, after netting out the small denomination notes from the currency in circulation on that day, it said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X