స్వల్ప మార్పుతో కొత్త రూ. 500 నోట్లు రిలీజ్: మార్పు ఇదే
భారత రిజర్వు బ్యాంకు స్వల్ప మార్పులతో మరోసారి రూ. 500 నోట్లను విడుదల చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది.
ముంబై: భారత రిజర్వు బ్యాంకు స్వల్ప మార్పులతో మరోసారి రూ. 500 నోట్లను విడుదల చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. నవంబర్ 8న రాత్రి పెద్ద నోట్లు రూ.500, 1000నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రద్దయిన పాత నోట్ల స్థానంలో కొత్తగా రూ.2వేలు, రూ.500 నోట్లను తీసుకొచ్చారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన కొత్త రూ.500 నోటులో ప్రస్తుతం స్వల్ప మార్పు, చేర్పులు చేశారు.
నోటుపై ఉన్న రెండు నంబర్ ప్యానల్స్‌పై 'ఆర్' అనే అక్షరం అంతర్లీనంగా కనిపించనుంది. మహాత్మాగాంధీ సిరీస్‌లో వస్తున్న ఈ నోటుపై 2016 సంవత్సరంతో పాటు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుందని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications