UPI పేమెంట్స్ తరహాలో ULI
ULI: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్.. క్లుప్తంగా యూపీఐ. దీని గురించి తెలియని వాళ్లు ఉండరు. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలో ఇదొక సంచలనం. పేటీఎం, ఫోన్ పే వంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్ జరిపే ప్రతి ఒక్కరికీ ఇది సుపరిచితమే. గ్రామీణ స్థాయిలోనూ డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టిందీ యూపీఐ.
అదే తరహాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకుని రానుంది. మరింత సులభంగా రుణాలను పొందడానికి యూఎల్ఐని తెర మీదికి తీసుకుని రాబోతోంది. ఈ ప్లాట్‌ఫామ్ కూడా మరో సంచలనాలకు తెర తీస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

దేశంలో రుణాల మంజూరు వ్యవస్థను మరింత వేగవంతం చేయడం దీని ఉద్దేశం. లెండింగ్ సెగ్మెంట్‌ను ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేయగలదని భావిస్తున్నారు. రుణాలు పొందడంలో ఇబ్బందులను తొలగించేలా యూఎల్ఐని రూపొందించినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
బెంగళూరులో ఏర్పాటైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో శక్తికాంత దాస్ మాట్లాడారు. పైలట్ ప్రాజెక్ట్‌గా యూఎల్ఐని ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో ఎదురయ్యే సాంకేతికపరమైన ఇబ్బందులను గుర్తించి.. పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా యూఎల్ఐని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను రూపురేఖలను యూపీఐ మార్చినట్లే దేశంలో రుణాలు ఇచ్చే విధానాన్ని కూడా యూఎల్ఐ మార్చివేస్తరందని ఆశిస్తున్నామని అన్నారు. గ్రామీణ రుణ గ్రహీతలకు ఇది మరింత ఉపయోగపడుతుందని, వారి అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు చెప్పారు.
జన్‌ధన్ యోజన-ఆధార్-మొబైల్ నంబర్, యూపీఐ తరువాత దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగంగా పరుగులు పెట్టించేలా, రుణాల జారీని మరింత వేగవంతం చేసేలా యూఎల్ఐ కూడా ఓ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. జామ్-యూపీఐ-యూఎల్ఐలను త్రిమూర్తులుగా అభివర్ణించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications