Reddy: గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ ఝలక్, నాలుగు దేశాల్లో బ్యాంక్ అకౌంట్లు, కోర్టు ఓకే, ఈ టైమ్ లో ?
సీబీఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి ఊహించిన షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గాలి అనుచరులు హడలిపోయారు,
బెంగళూరు/బళ్లారి: మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ మరోసారి ఝలక్ ఇచ్చింది. బీజేపీకి గుడ్ బై చెప్పి కొత్త రాజకీయ పార్టీ పెట్టి కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టారు. బళ్లారి నుంచి గాలి జనార్దన్ రెడ్డి భార్య పోటీ చేస్తారని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఇలాంటి సమయంలో సీబీఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి ఊహించిన షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గాలి అనుచరులు హడలిపోయారు,

అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్
కర్ణాటకలో అతి త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే కచ్చితంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. జేడీఎస్ నేనే కింగ్ మేకర్ అంటోంది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టి ఉత్తర కర్ణాటకలో తన సత్తా చాటుకుని కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

విదేశాల్లో గాలి ఫ్యామిలీకి బ్యాంక్ అకౌంట్లు !
అక్రమ మైనింగ్ చేశాడని గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అక్రమ మైనింగ్ చేసిన గాలి జనార్దన్ రెడ్డి భారీ మొత్తంలో డబ్బులు సంపాధించారని, ఆ డబ్బులు విదేశాలకు తరలించారని మాకు సమాచారం ఉందని, వాటి సమాచారం తెలుసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు.

మిలియన్ మెట్రిక్ టన్నులు
అక్రమ మైనింగ్ చేసిన గాలి జనార్దన్ రెడ్డి 2009-2010 మధ్య కాలంలో సుమారు 7 నుంచి 8 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడిసరు అక్రమంగా విదేశాలకు తరలించారని, ఆ విధంగా భారీ మొత్తంలో డబ్బులు సంపాధించారని సీబీఐ అధికారులు ఆరోపించారు. విదేశాలకు తరలించిన ముడిసరకుతో గాలి జనార్దన్ రెడ్డి భారీ మొత్తంలో డబ్బులు సంపాధించారని సీబీఐ అధికారులు అంటున్నారు.

గాలికి నాలుగు దేశాల్లో బ్యాంక్ అకౌంట్లు ?
స్విజర్లాండ్, యూఏఇ, సింగపూర్ తో పాటు మరో దేశంలోని ఆదేశాలకు చెందిన విదేశీ బ్యాంకుల్లో గాలిజనార్దన్ రెడ్డి డబ్బు దాచిపెట్టాడని సీబీఐ అధికారులు ఆరోపించారు. స్విజర్లాండ్ లోని జీఎల్ ఏ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎవరిది ?, ఆ కంపెనీ యజమాని ఎవరు? వాళ్ల బ్యాంకు అకౌంట్లు ఎన్ని, బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అని పూర్తి సమాచారం సేకరించడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు.

కోర్టు గ్రీన్ సిగ్నల్
సీబీఐ పిటిషన్ పరిశీలించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ. చంద్రకళా వివరాలు సేకరించడానికి సీబీఐ అధికారులకు అనుమతి ఇచ్చారు.గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన భార్య గాలి లక్ష్మి, రిటైడ్ ఐఏఎస్ అధికారి శివలింగమూర్తి, ఐఎఫ్ఐ అధికారి ఎస్. ముత్తయ్య, గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మోహవూజ్ ఆలీ ఖాన్, ఎస్ పీ, రాజు, మహేష్, ఎ, పాటిలా. రిటైడ్ అటవి శాఖ అధికారి హెచ్. రామమూర్తి మీద ఇప్పటికే సీబీఐ కేసులు నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గాలి జనార్దన్ రెడ్డికి మరోసారి సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications