29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లను మింగేశాడు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
సాధారణంగా కోపం వస్తే గట్టిగా అరుస్తారు. లేదా ఎవరిపైనైనా చూపిస్తారు. ఇలా కోపాన్ని చాలా మంది అనేక రకాలుగా ప్రదర్శిస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం స్టీల్ స్పూన్లు టూత్ బ్రష్‌లను తినడం ప్రారంభించాడు. అలా 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లను మింగేశాడు. దీంతో అతడి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లా బులంద్ షహర్ కు చెందిన 40 ఏళ్ల సచిన్ మద్యం, మత్తు పదార్ధాలకు బానిసయ్యాడు. దీంతో అతడ్ని డీ-అడిక్షన్ సెంటర్ లో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే తనను డీ-అడిక్షన్ సెంటర్ లో చేర్పించారన్న కోపంతో సచిన్ వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అలా 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లను మింగాడు. ఆ తర్వాత సచిన్ ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అక్కడి సిబ్బంది అతడ్ని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించింది. అయితే వైద్యులు అల్ట్రా సౌండ్, ఎక్స్ రే పరీక్షలు చేశారు. రిజల్ట్ చూసి వైద్యులు షాక్ అయ్యారు.

వెంటనే అక్కడ వైద్యుడు డా.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్టార్ట్ చేయగా సచిన్ కడుపులోంచి 49 స్టీల్ చెంచాలు, టూత్ బ్రష్ లు బయటపడ్డాయి. 29 స్టీల్ చెంచాలు, 19 టూత్ బ్రష్ లు, 2 పెన్‌లు బయటకు తీశారు. శస్త్రచికిత్స తర్వాత మొత్తం వస్తువులు బయటకు తీసినట్లు డా.శ్యామ్ కుమార్ తెలిపారు. మానసిక సమస్యలున్న వారు ఇలాంటి పనులు చేస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని.. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడని తెలిపారు.












Click it and Unblock the Notifications