Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త: రూ.349, రూ.399లకు కొత్తప్లాన్స్‌ను ప్రకటించిన జియో

రిలయన్స్ జియో కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. ధనాధన్ ఆఫర్‌, సమ్మర్‌సర్‌ఫ్రైజ్ ఆఫర్లు ముగుస్తున్నందున కొత్త ఫ్లాన్స్‌ను ప్రకటించింది జియో.

ముంబై: రిలయన్స్ జియో కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. ధనాధన్ ఆఫర్‌, సమ్మర్‌సర్‌ఫ్రైజ్ ఆఫర్లు ముగుస్తున్నందున కొత్త ఫ్లాన్స్‌ను ప్రకటించింది జియో.

ఉచిత వాయిస్‌కాల్స్, డేటాతో మార్కెట్లో‌కి వచ్చి సంచలనం సృష్టించిన జియో మరోసారి కొత్తప్లాన్స్‌ను ప్రకటించింది. అయితే జియో కారణంగా ఇప్పటికే టెలికం పరిశ్రమ వేలాదికోట్లను నష్టపోయిందని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.

జియోపై ఆర్‌కామ్ ఇటీవలనే తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొత్త ప్లాన్స్ కూడ మరో మూడుమాసాలపాటు అమల్లోకి రానున్నాయి. జియో ఆఫర్లతో ఇప్పటికే ప్రత్యర్థి కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

మరోవైపు తాజాగా జియో మరోసారి ఈ రకమైన ఆఫర్‌ను ప్రకటించడంతో ప్రత్యర్థి కంపెనీలు ఏ రకంగా స్పందిస్తాయోననే ఆసక్తి నెలకొంది.గతంలో మాదిరిగానే ఉచిత వాయిస్‌కాల్స్‌తోపాటు డేటాను ఇవ్వనుంది జియో.

జియో కొత్తప్లాన్స్ ఇవే

జియో కొత్తప్లాన్స్ ఇవే

రిలయన్స్‌ జియో కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. రెండు కొత్త ప్లాన్స్ ఉన్నాయి. రూ.399, రూ.349లతో కొత్త ప్లాన్స్‌ను జియో ప్రకటించింది. ప్రీపెయిడ్ ప్లాన్స్‌గా జియో ప్రకటించింది. ఈ కొత్త జియో ప్లాన్స్‌లో భాగంగా రూ. రూ.349 రీఛార్జీతో 20జీబీ 4జీడేటాను 56రోజులపాటు వినియోగించుకోవచ్చు.అయితే ప్రతిరోజూ ఇంత డేటానే వాడుకోవాలనే పరిమితి లేదు. ఒక్కసారి 20జీబీ డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ కూడ 128కు పడిపోతోంది.

రూ399 ప్లాన్ కింద మూడుమాసాలపాటు అపరిమిత డేటా

రూ399 ప్లాన్ కింద మూడుమాసాలపాటు అపరిమిత డేటా

రూ.399 ప్లాన్ కారణంగా మూడుమాసాలపాటు అపరిమిత సర్వీసులను వాడుకోవచ్చు. ఈ ప్లాన్ అచ్చంగా ముందస్తు ప్రకటించిన రూ.309 ప్లాన్ మాదిరిగానే ఉంది. ఈ ప్లాన్‌లో జియోడేటా పరిమితిని విధించింది. రోజుకు 1 జీబీడేటాను మాత్రమే వినియోగించుకొనే అవకాశముంటుంది. ధనాధన్ ఆఫర్ ఇప్పుడు కేవలం రూ.399 ప్లాన్‌కే 84 రోజులపాటు అందుబాటులో ఉంటుందని సమాచారం.

రూ.19లనుండి ప్రీఫెయిడ్ ప్లాన్స్

రూ.19లనుండి ప్రీఫెయిడ్ ప్లాన్స్

ప్రీపెయిడ్ ప్లాన్లు రూ.19 నుండి ప్రారంభమై రూ.9999 వరకు ఉన్నాయి. ప్రస్తుతం రూ.309, రూ.509 ప్లాన్స్ కూడ వాలిడిటీలో ఉన్నాయి. రూ.309 ప్లాన్ కింద 609 జీబీ డేటాను, రూ.509 ప్లాన్ కింద 128జీబీ డేటాను జియోను అందిస్తోంది. రూ.999 ప్లాన్‌కింద రూ.90 జీబీ డేటాను వినియోగదారులు వారు ఆ ప్రయోజనాలు వినియోగించుకోవచ్చు.

రూ.309 రీచార్జీపై రెండునెలలపాటు అపరిమిత సర్వీసులు

రూ.309 రీచార్జీపై రెండునెలలపాటు అపరిమిత సర్వీసులు

రూ.309 ప్లాన్‌ను కొనసాగించాలనుకొంటున్నారో వారు ఆ ప్రయోజనాలు వినియోగించుకోవచ్చు. రూ.309 రీచార్జీపై రెండుమాసాలపాటు అపరిమిత సర్వీసులు అందుతాయి. అన్ని దీర్ఘకాలిక ప్లాన్స్‌ను కూడ ఒకనెల అదనపు ప్రయోజనాలతో కంటిన్యూ చేసుకోవచ్చని జియో ప్రకటించింది.అంతేకాకుండా ఈడీఎంవీ ప్లాన్స్ జియో ప్రకటించింది. రూ.149 ప్లాన్స్‌లో ఎలాంటి మార్పులను జియో చేపట్టలేదు. కొత్త కస్టమర్లు రూ.99 చెల్లించే జియో ప్రైమ్‌ను ఎన్‌రోల్ చేసుకోవచ్చని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+