వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛార్జీల బాదుడుపై పునరాలోచించండి: బ్యాంకులకు కేంద్రం సూచన

ఖాతాదారులకు అదనపు రుసుముల వడ్డింపునకు పలు బ్యాంకులు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిపై పునరాలోచించాల్సిందిగా అన్ని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఖాతాదారుల నుంచి పలు విధాలుగా ఛార్జీలు వసూలు చేసేందుకు పలు బ్యాంకులు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిపై పునరాలోచించాల్సిందిగా అన్ని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది.

సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోవతే అపరాధ రుసుముతోపాటు సేవా పన్నును ఏప్రిల్ 1 నుంచి వసూలు చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Rethink on Imposing Charges : Union Govt suggestion to Banks

ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నాలుగు మించి లావాదేవీలు జరిపితే రూ.150 చొప్పున రుసుము వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో నడిచేందుకు మిగిలిన బ్యాంకులు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

బ్యాంకులు, ఏటీఎంల ద్వారా మూడు, నాలుగుకు మించిన నగదు లావాదేవీలపై అదనపు రుసుములు విధించనున్నట్లు పలు ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే స్పష్టం చేశాయి. బ్యాంకుల తీరుపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.

English summary
State Bank of India, the country’s largest lender, will charge Rs50 for each transaction beyond the free transaction limit, plus service tax, from 1 April. Top private sector banks have started imposing cash transaction charges—another move to nudge customers towards cashless transactions. Customers of ICICI Bank, Axis Bank, HDFC Bank and Kotak Mahindra Bank will have to pay minimum Rs 150 for cash transactions beyond the free limit. Savings bank account holders of SBI will be able to make three free cash transactions in a month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X