Revenge: భార్య కోసం, పెళ్లామ్ పుట్టింటి మీద దాడి, కొడవలితో అత్తమామలు, భార్య, బావమరిది మీద !

కొచ్చి/కేరళ: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కూతురు ఉంది. పాప పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో భార్య ఆమె కూతురితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నది. భార్య, కూతురిని ఇంటికి పిలుచుకుని రావాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే భార్య మాత్రం నేను చచ్చినా నీ ఇంటికి రాను అని తేల్చి చెప్పింది. నువ్వు ఎక్కడైనా చావు, నా బిడ్డను నాకు ఇచ్చేయ్ అని భర్త చెప్పాడు. ఆ సమయంలో దంపతుల మద్య గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో భార్య తండ్రి మనుమరాలిని ఎత్తుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రయత్నించాడు. ఆ సందర్బంలో రగిలిపోయిన భర్త అతని భార్యను, అత్తా, మామ, బావమరిది మీద కొడవలితో దాడి చెయ్యడం కలకలం రేపింది.

 పెద్దలు సెట్ చేసిన పెళ్లి

పెద్దలు సెట్ చేసిన పెళ్లి

కేరళలలోని తిరువనంతపురం సమీపంలోని ధనువాచపురంలో సుజిత్ కుమార్ అలియాస్ సుజిత్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్పరాల క్రితం కట్టకాడలో నివాసం ఉంటున్న అశ్వతి (24) అనే యువతిని సుజిత్ పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న సుజిత్, అశ్వతి దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు.

 పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

సుజిత్, అశ్వతి దంపతులకు ఓ కూతురు ఉంది. రెండు సంవత్సరాల క్రితం పాప పుట్టిన తరువాత సుజిత్, అశ్వతి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో అశ్వతి ఆమె కూతురితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నది. భార్య అశ్వతి, రెండేళ్ల కూతురిని ఇంటికి పిలుచుకుని రావాలని సుజిత్ అనేక ప్రయత్నాలు చేశాడు.

 నీచావు నువ్వు చావు, నా బిడ్డను ఇచ్చేయ్

నీచావు నువ్వు చావు, నా బిడ్డను ఇచ్చేయ్

సుజిత్ ఎంత నచ్చచెప్పినా అతని భార్య అశ్వతి మాత్రం నేను చచ్చినా నీ ఇంటికి రాను అని తేల్చి చెప్పింది. భార్య అశ్వతిని ఇంటికి పిలుచుకుని రావాలని అనేక ప్రయత్నాలు చేసిన సుజిత్ విసిగిపోయాడు. రాత్రి 8 గంటల సమయంలో సుజిత్ అతని భార్య అశ్వతి పుట్టింటి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో సుజిత్, అశ్వతిల మద్య పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. నువ్వు ఎక్కడైనా చావు, నా బిడ్డను నాకు ఇచ్చేయ్ అని సుజిత్ అతని భార్య అశ్వతికి చెప్పాడు.

 భార్య ఇంటి దగ్గర భర్త హంగామా

భార్య ఇంటి దగ్గర భర్త హంగామా

ఆ సమయంలో సుజిత్, అశ్వతి దంపతుల మద్య గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో అశ్వతి తండ్రి మనుమరాలిని ఎత్తుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రయత్నించాడు. అక్కడే ఉన్న సుజిత్ మామ దగ్గర పాపను లాక్కొవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో అశ్వతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందరూ సుజిత్ ను చుట్టుముట్టారు.

 భార్య, అత్తమామలు, బావ మరిది మీద కొడవలితో దాడి

భార్య, అత్తమామలు, బావ మరిది మీద కొడవలితో దాడి

సహనం కోల్పోయిన సుజిత్ వెంట తీసుకెళ్లిన కొడవలి తీసుకుని భార్య అశ్వతితో పాటు ఆమె తల్లిదండ్రులు, బావమరిది మీద దాడి చేశాడు. కొడవలితో దాడి చెయ్యడంతో అశ్వతితో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. భార్య కుటుంబ సభ్యుల మీద కొడవలితో దాడి చేసిన సుజిత్ మీద కేసులు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+