Revenge: ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు. కొడుకు తండ్రి బిగ్ షాట్, నగ్న ఫోటోలతో ?, ఫుట్ బాల్ ఆడేసి !
బెంగళూరు: కోటీశ్వరుడు అయిన వ్యక్తి అతని కొడుకును బాగా చదివించాడు. బాగా చదువుకున్న యువకుడికి మంచి పెళ్లి సంబందం చూసి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కోటీశ్వరుడి కూతురిని ఇంటి కోడలిగా చేసుకోవాలని ఆ యువకుడి కుటుంబ సభ్యులు అనుకున్నారు. పక్క రాష్ట్రానికి చెందిన యువతి చదువు పూర్తి చేసుకుని ఐటీ హబ్ లో కంప్యూటర్ కోర్స్ చేసి మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. ఐటీ హబ్ లో కంప్యూటర్ కోర్స్ చేస్తున్న యువతికి, కోటీశ్వరుడి కొడుక్కి పరిచయం అయ్యింది. యువతి, యువకుడి పరిచయం రానురాను ప్రేమకు దారి తీసింది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న యువతి ఆమె ప్రియుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అతనితో కలిసి బయట తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు డిసైడ్ అయ్యాడు. ఈ విషయం ప్రియుడి తండ్రికి తెలిసిపోయింది. మన కులం కానిది, మన ఆస్తులు, అంతస్తులకు సరిపోని యువతి నా ఇంటి కోడలిగా ఎలా వస్తుంది ? అంటూ ఆ కోటీశ్వరుడు రిగిలిపోయాడు. కొడుకు తన మాట వినడని, అతను ప్రియురాలి మోజులో పడిపోయాడని తెలుసుకున్న తండ్రి ఆ అమ్మాయి అంతు చూడాలని అనుకున్నాడు. పరిచయం ఉన్న రౌడీషీటర్ తో డీల్ మాట్లాడుకున్న కోటీశ్వరుడు నా కొడుకు ప్రేమించిన అమ్మాయి ఈ సిటీలోనే ఉండకూడదని, నువ్వు ఏం చేస్తావో తెలీదని, నువ్వు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తానని చెప్పాడు. రంగంలోకి దిగిన రౌడీషీటర్ ప్రియురాలు ఏకాతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి ప్రియుడి తండ్రికి ఇచ్చాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలైయ్యింది.

బాగా చదువుకున్న యువకుడు
ఐటీ హబ్ బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో రాజశేఖర్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కోటీశ్వరుడు అయిన రాజశేఖర్ అతని కొడుకు రాకేష్ (పేరు మార్చడం జరిగింది)ను బాగా చదివించాడు. బాగా చదువుకున్న రాకేష్ కు మంచి పెళ్లి సంబందం చూసి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కోటీశ్వరుడి కూతురిని ఇంటి కోడలిగా చేసుకోవాలని రాకేష్ కుటుంబ సభ్యులు అనుకున్నారు.

లవ్ లో పడిన యువకుడు
పక్క రాష్ట్రానికి చెందిన సవిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతి చదువు పూర్తి చేసుకుని ఐటీ హబ్ బెంగళూరులో కంప్యూటర్ కోర్స్ చేసి మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. ఐటీ హబ్ లో కంప్యూటర్ కోర్స్ చేస్తున్న సవితకు, కోటీశ్వరుడు రాజశేఖర్ కొడుకు రాకేష్ కు రెండు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. రాకేష్, సవితల పరిచయం రానురాను ప్రేమకు దారి తీసింది.

ప్రియుడి తండ్రి రగిలిపోయాడు
కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న సవిత ఆమె ప్రియుడు రాకేష్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు అతనితో కలిసి బయట తిరుగుతూ ఎంజాయ్ చేసింది. ప్రియురాలు సవితను పెళ్లి చేసుకోవాలని ఆమె ప్రియుడు రాకేష్ గత ఏడాది మొదట్లోనే డిసైడ్ అయ్యాడు. ఈ విషయం ప్రియుడు రాకేష్ తండ్రి రాజశేఖర్ కు తెలిసిపోవడంతో ఆయన రగిలిపోయాడు.

కులం తక్కువ, ఆస్తులు, అంతస్తులు లేవని ?
సవితది మన కులం కానిది, మన ఆస్తులు, అంతస్తులకు సరిపోని ఆమె నా ఇంటి కోడలిగా ఎలా వస్తుంది ? అంటూ ఆ కోటీశ్వరుడు రాజశేఖర్ రిగిలిపోయాడు. ఇదే విషయంలో తండ్రి కొడుకులు రాజశేఖర్, రాకేష్ ల మద్య పెద్ద గొడవలు జరిగాయి. బంధువులు నచ్చ చెప్పినా రాజశేఖర్, అతని కొడుకు రాకేష్ మాత్రం ఎవ్వరి మాట వినలేదు.

ప్రియురాలితో కాపురం పెట్టేశాడు
కుటుంబ సభ్యులతో గొడవపడిన రాకేష్ చివరికి గత ఏడాదిలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసి అతని ప్రియురాలు సవితతో కలిసి పెళ్లికాకుండానే లివింగ్ టూ గెదర్ రిలేషన్ షిప్ కొనసాగిస్తూ ప్రియురాలితోనే కాలం గడిపేశాడు. ఈ దెబ్బతో రాకేష్ తండ్రి రాజశేఖర్ ఇంకా అతని కొడుకు ప్రియురాలు సవిత మీద రగిలిపోయాడు.

రౌడీషీటర్ ఎంట్రీ
నా కొడుకు రాకేష్ తన మాట వినడని, అతను ప్రియురాలు సవిత మోజులో పడిపోయాడని తెలుసుకున్న తండ్రి రాజశేఖర్ ఆ అమ్మాయి అంతు చూడాలని అనుకున్నాడు. హెచ్ఎస్ఆర్ లేఔట్ లోనే ఉంటున్న నందీష్ (31) అనే రౌడీషీటర్, రాకేష్ తండ్రి రాజశేఖర్ కు గతంలోనే పరిచయం ఉంది.

ఎంతకావాలంటే అంత ఇస్తా.... ఏం చేస్తావో నాకు తెలీదు
కోటీశ్వరుడు రాజశేఖర్, రౌడీషీటర్ నందీష్ కలిసి సవిత విషయంలో చర్చించుకున్నారు. నా కొడుకు రాకేష్ ప్రేమించిన సవిత బెంగళూరు సిటీలోనే ఉండకూడదని, నువ్వు ఏం చేస్తావో తెలీదని, నువ్వు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తానని రౌడీషీటర్ నందీష్ కు చెప్పాడు.

అమ్మాయి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
రంగంలోకి దిగిన రౌడీషీటర్ నందీష్ రాకేష్ ప్రియురాలు సవిత ఏకాతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి ప్రియుడి తండ్రి రాజశేఖర్ కు ఇచ్చాడు. తరువాత సవితను కలిసిన రౌడీషీటర్ నందీష్ నువ్వు బెంగళూరు వదిలి వెళ్లిపోకపోతే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించాడు, నువ్వు రాకేష్ ను మరిచిపోవాలని రౌడీషీటర్ నందీప్ రాకేష్ ప్రియురాలు సవితకు వార్నింగ్ ఇచ్చాడు.

దెబ్బకు అందరూ ఢమాల్
రౌడీషీటర్ బెదిరింపులకు భయపడకుండా సవిత బెంగళూరులోనే ఉంది. రానురాను నందీష్ నుంచి బెదిరింపులు ఎక్కువ రావడంతో సవిత బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రౌడీషీటర్ నందీష్ ను అరెస్టు చేశారు. రాకేష్ తండ్రి రాజశేఖర్ సవిత నగ్న వీడియోలు, ఫోటోలు తియ్యాలని రౌడీషీటర్ నందీష్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు ప్రియుడు రాకేష్ తండ్రిని విచారణ చెయ్యడానికి రంగంలోకి దిగారు. గతంలో రౌడీషీటర్ నందీష్ మీద హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, దాడులు చేశాడని మొత్తం 6కు పైగా కేసులు ఉన్నాయని, అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications