Yamuna: ఇంకా ప్రమాదస్థాయిలోనే ప్రవహిస్తోన్న యమునా నది..

యమునా నది ఇంకా ప్రమాదస్థాయిలోనే ప్రవాహిస్తోంది. ఆదివారం ఉదయం యమునా నది నీటిమట్టం ప్రమాద స్థాయి 205.33 దాటి 206.02 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. సెంట్రల్ వాటర్ కమీషన్ ప్రకారం, ఈ రోజు రాత్రి 10 గంటలకు నీటి మట్టం 205.75 మీటర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో వర్షం కురిసింది. ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

శనివారం నాటి వర్షం వల్ల యమునా నది నీటి మట్టం పెరగలేదు, యమునా ప్రవాహం పెరగడానికి హర్యానా లోని హత్ని కుండ్బ్యారేజీ గేట్లు ఎత్తడమే కారణమని ఢిల్లీ ఆప్ ప్రభుత్వం విరుచుకపడింది. అయితే దీన్ని బీజేపీ తోసిపుచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడి ఢిల్లీలో వరదల పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. "ఢిల్లీకి చేరుకున్న వెంటనే, యమునా నది కారణంగా ఢిల్లీలో వరదల పరిస్థితి, తీసుకుంటున్న చర్యలపై గురించి ఢిల్లీ ఎల్‌జీతో ప్రధాని మాట్లాడినట్లు" ఒక అధికారి తెలిపారు.

River Yamuna i

వజీరాబాద్‌, చంద్రవాల్‌లోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఈరోజు పనిచేయనుండటంతో ఆదివారం నుంచి రాజధానిలో సాధారణ నీటి సరఫరా ప్రారంభమైంది. సంక్షోభ సమయంలో IAS అధికారులు ప్రభుత్వానికి సహకరించలేదని ఆప్ మంత్రులు పేర్కొన్నారు. డివిజనల్ కమిషనర్ అశ్వనీ కుమార్‌కు పంపిన వాట్సాప్ సందేశాల స్క్రీన్‌షాట్‌లు వైరల్ కావడంతో, కుమార్ తనపై ఆరోపణలు దురదృష్టకరమని అన్నారు. "ఇలాంటి సమయంలో ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. అతిషీ జీతో నేను ఒక మాట చెప్పాను. బహుశా వాళ్లు రాజకీయాలు చేయాలనుకుంటున్నారని దీన్నిబట్టి తెలుస్తోంది. మీరు చెబితే నేనే బాధ్యత వహిస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఇతరులలా కాకుండా నేను ఎవరినీ నిందించను" అని కుమార్ చెప్పాడు.

ఢిల్లీలో యమునా నది పరివాహాక ప్రాంతాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. అక్కడున్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది తాగాడానికి నీరు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో పెరుకుపోయిన బురదని అధికారులు తొలదించే ప్రయత్నం చేస్తున్నారు. యమునా నది నీటిమట్టం నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో ఆదివారం మజ్ను కా తిలా నుంచి కశ్మీర్ గేట్ వరకు రహదారి పరిస్థితి మెరుగుపడింది. అయితే కుండపోత వర్షంతో ఈ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+