దోపిడీకి వచ్చాడు.: ప్రియుడ్ని చంపి ప్రేయసిని రేప్ చేశాడు

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దోపిడిదారుడు చోరీకి వచ్చి 26 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపి, అతని ప్రేయసిపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన అంబర్‌నాథ్ - తిత్వాల రోడ్డులోని నిర్మానుష్యమైన ప్రదేశంలో సోమవారంనాడు జరిగింది.

పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను అందించారు. గణేష్ దినకర్ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌‌ను మోటార్ సైకిల్‌పై సోమవారం సాయంత్రం వాహ్యాళికి తీసుకుని వెళ్లాడు. వారు ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆగారు. సాధారణంగా జంటలు అక్కడికి వస్తుంటాయి.

మూడు రౌండ్లు కాల్పులు

మూడు రౌండ్లు కాల్పులు

సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వ్యక్తి తమ వద్దకు వచ్చి గన్ గురిపెట్టి నగదు, ఫోన్లు ఇవ్వాలని బెదిరించాడు దినకర్ ప్రతిఘటించాడు. దాంతో దినకర్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు దాంతో దినకర్ కింద పడిపోయాడు. ఆ తర్వాత యువతిపై లైంగిక దాడి చేశాడు.

మోటార్ సైకిల్ తీసుకుని పరారీ

మోటార్ సైకిల్ తీసుకుని పరారీ

మోటార్ సైకిల్‌తో పాటు ఇతర వస్తువులు తీసుకుని పారిపోయాడు. తిత్వాల పోలీసు స్టేషన్‌కు బాధితురాలు ఓ వ్యక్తి వాహనంపై చేరుకుని ఫిర్యాదు చేసింంది. దినకర్ చైనీస్ ఈటరీలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు.

నిందితుడి కోసం పోలీసుల వేట

నిందితుడి కోసం పోలీసుల వేట

అమ్మాయి నివాసం అంబర్‌నాథ్‌లో ఉంది. నిందితుడి కోసం థానే రూరల్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాయి. స్తానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా గాలిస్తున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు

కేసు నమోదు చేసిన పోలీసులు

తిత్వాల పోలీసులు అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం సెంట్రల్ ఆస్పత్రికి పంపించారు. దినకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తంతరలించారు. దోపిడీదారుడపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+