Chandrayaan-3:ISRO శాస్త్రవేత్తలు జీతం, అలవెన్సులు ఇవే..!

Chandrayaan-3:యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలు రాయిని తాకనుంది. చంద్రయాన్-3 ఆగష్టు 23 సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిని ముద్దాడనుంది. ఈ అపూర్వ ఘట్టం కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. భారత్‌కు ఇస్రో శాస్త్రవేత్తలకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నాయి.

జూలై 14న చంద్రయాన్-3 శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించింది. ఇప్పటి వరకు చంద్రయాన్-3లోని సాంకేతిక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోంది.జాబిల్లి మీదకు మరికొన్ని గంటల్లో చంద్రయాన్ ల్యాండ్ కానుండటంతో ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. గత అనుభవాలు ఈసారి రిపీట్ కాకుండా అంతా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. అయితే విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యేవరకు యావత్ దేశం ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది.

Rocketing rewards: A closer look at ISRO scientists salaries perks and allowances

చంద్రయాన్ ప్రాజెక్టు కోసం ఇస్రో శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా శ్రమిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ భారీ ప్రాజెక్టు కోసం ఇస్రోకు ఎప్పటికప్పుడు సహాయసహకారాలు అందిస్తూ వస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్‌ గర్వపడేలా చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలకు ఎంత వేతనం అందుతుందో చాలామంది నెటిజెన్లు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.

ఇస్రో లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇంజినీర్‌గా పనిచేయడం మామూలు విషయం కాదు. అంతరిక్ష రంగంలో నిత్యం పరిశోధనలు చేసే ఇస్రో శాస్త్రవేత్తల వేతనం నెలకు రూ.15,600 నుంచి రూ.39,100 నుంచి రూ.75,500 - రూ.80,000 వరకు ఉంటుంది. అయితే ఈ వేతనం కొన్ని అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది లేదా మారుతుంది.అంటే సైంటిస్ట్ యొక్క అనుభవం, విద్యార్హతలు, జాబ్ పొజిషన్, తాను పని చేస్తున్న ప్రాంతంలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వేతనం చెల్లించడం జరుగుతుంది.

Rocketing rewards: A closer look at ISRO scientists salaries perks and allowances

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో సమర్థవంతమైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకునేందుకు ఏటా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ వివిధ ఇంజినీరింగ్ డిసిప్లిన్‌ల‌కు ఉంటుంది. 7వ వేతన సంఘం సవరణ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తల వేతనాలు సవరించబడ్డాయి.ఇక వేతనంతో పాటు సైంటిస్టులకు చాలా అలవెన్సులు, ప్రత్యేక అలవెన్సులు ఉంటాయి.ఇందులో డీఏ, హెచ్‌ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సులు ఉంటాయి.ఇస్రోలో ఒక శాస్త్రవేత్తకు ఇచ్చే వేతనంతో అతని జీవితానికి భద్రత, ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది.

ఇస్రో సైంటిస్టులకు డీఏ ఏటా రెండు సార్లు వస్తుంది. శాస్త్రవేత్తలకు ప్రతి నెలా 10 నుంచి 30 శాతం వరకు డీఏ ఉంటుంది. ఇక HRA విషయానికొస్తే ఇస్రో శాస్త్రవేత్త పనిచేస్తున్న నగరం ఆధారంగా డిసైడ్ అవుతుంది. అది బేసిక్ పేకు 10శాతం నుంచి 30శాతం వరకుంటుంది. ఇక ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ రూ.400 నుంచి రూ.3200 వరకు గ్రేడ్ పే ఆధారంగా చెల్లించడం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+