Snakes:ఆ ఇంట్లో బయటపడ్డ 60 పాములు..ఒళ్లు గగుర్పొడిచే ఘటన..!

పాట్నా: మన కళ్ల ముందు ఓ పాము కనిపిస్తే భయంతో ఆమడదూరం పరిగెడతాము. అలాంటిది ఒకేసారి 60 పాములు దర్శనమిస్తే... పరిస్థితేంటి..? గుండె జారి కడుపులో పడుతుంది. ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటు చేసుకుంది. రోహ్తాస్ జిల్లాలోని అగ్రెడ్ ఖుర్ద్ గ్రామంలోని సూర్యపుర పోలీస్ స్టేషన్‌‌ పరిధిలో నివసించే క్రిప నారాయణ్ పాండే అనే ఓ వ్యక్తి ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 విష సర్పాలు ప్రత్యక్షమయ్యాయి.

ఇంట్లో ఈ పాములను చూడగానే ఇంట్లోవారంతా ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఇంటిలోనుంచి బయటకు పరుగులు తీసి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం పలువురు గ్రామస్తులను వెంటేసుకొచ్చి అందులోని కొన్ని పాములను చంపేశారు. ఈ పాములన్ని గోధుమ రంగులో ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో పాములు బయటపడటంతో ఈ వార్త దావనంలో చుట్టుపక్కల గ్రామాలకు పాకింది.

Rohtas residence holds Surprise: 60 Snakes Unearthed,Half Relocated to Forest

ముందుగా కృపా నారాయణ్ పాండే రెండంతస్తుల ఇంట్లో ఏడెనిమిది పాములు కనిపించినట్లు బ్లాక్ రెవెన్యూ అధికారి దివ్య ప్రకాష్ తెలిపారు. అనంతరం ఒక్కొక్కటిగా మరిన్ని పాములు బయటకు వచ్చాయి. దీంతో ఆ పాముల సంఖ్య 60కి చేరిందని చెప్పారు. ఇక ఫారెస్టు అధికారులు ఇంటికి చేరుకోకముందే రెండు డజన్ల పాములను గ్రామస్తులు కర్రతో కొట్టి చంపేశారు. ఇక మిగతా పాములను అటవీశాఖ రెస్క్యూటీమ్ వెతికి పట్టుకోవడంతో ఈ స్నేక్ ఆపరేషన్ ముగిసింది. కొన్ని పాములు గాయాలతో తప్పించుకున్నాయి. వాటిని పట్టుకున్న అధికారులు చికిత్స చేసి తిరిగి అడవిలోకి వదిలేశారు.

గాయపడిన పాములన్నీ ఇంట్లోని ఓ గోడ వెనక నక్కి ఉన్నాయి. ఆ పాములను బయటకు తీసి అందులో గాయపడిన పాములకు చికిత్స అందించి మిగతావాటిని అడవిలోకి వదిలేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఆ ఇంట్లో 1955 నుంచి ఉంటున్నట్లు చెప్పిన కృపా నారాయణ్ పాండే.. అంతకుముందు ఇలాంటి ఘటన కానీ ఒక్క పాము వచ్చిన సంఘటన కానీ తాము చూడలేదని చెప్పారు. ఒక్కో పాము రెండు నుంచి రెండున్నర అడుగుల వరకు ఉంటుందని నారాయణ్ చెప్పారు. మొత్తానికి పెద్ద మొత్తంలో పాములు ఆ ఇంట్లో కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంట్లో వారి పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+