శవంతో శృంగారం: ‘అశ్వద్ధామ’మూవీలో విలన‌్ మాదిరిగా.. కామాంధుడి అరెస్ట్..
ఇటీవల వచ్చిన అశ్వద్ధామ సినిమాలో ఓ సీన్ విలన్ నైజానికి అద్దం పట్టింది. విలన్ అంటే పాత సినిమాల్లో భారీకాయంతో, మొహాంపై మచ్చలు ఉండవు. అతను సమాజంలో పేరున్న డాక్టర్. ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేసే వైద్యుడు.. కానీ... తన ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం వచ్చిన యువతి శవంపై లైంగికదాడి చేస్తాడు. ఇదేంటి అని తండ్రి అడిగితే.. బతికుంటే ఏంటీ.. చనిపోతే ఏంటీ అని సమాధానం చెబుతాడు. ఈ సీన్ అతనిలో క్రూర మనస్తత్వానికి నిదర్శనం. అదీ సినిమా.. రీల్ లైఫ్... కానీ రియల్ లైఫ్‌లో ఓ నీచుడు కూడా ఇలా చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు.

సైకో సైకియా..
అసోం ధేమాజీ జిల్లా సిలాపథర్ పోలీసు స్టేషన్ పరిధిలో అకాన్ సైకియా (50) అనే అతను ఉంటున్నాడు. ఫ్యామిలీలో వివాదం నేపథ్యంలో.. ఇతనిపై భార్య 2018లో కేసు పెట్టడంతో జైలు కెళ్లాడు. అయితే కరోనా వైరస్ దృష్ట్యా ఖైదీలను విడుదల చేయాలని కోర్టు ఆదేశాల మేరకు.. సైకియా బయటకొచ్చాడు. కానీ తన బుద్ది మాత్రం పోనివ్వలేదు. భార్య దగ్గరికి వెళ్లకుండా.. డెమోగావ్ గ్రామానికి వెళ్లాడు. అయితే మే 17వ తేదీన 14 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా చనిపోవంతో.. సిమెన్ నది ఒడ్డున తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు. బాలికను అక్కడ పూడ్చి పెట్టారని ఎలా సమాచారం తెలుసుకున్నాడే.. ఏమో కానీ... మరునాడు సమాధిని తవ్వడం ప్రారంభించాడు.

ఎర్రని ఎండలో..
మధ్యాహ్నం ఎవరూ ఉండరని భావించి సమాధిని తవ్వుతున్నాడు. బాలిక మృతదేహన్ని బయటకు కూడా తీశాడు. శవంపై రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే నది ఒడ్డున ఉన్న జాలర్లు.. సైకియా చర్యను చూసి విస్తుపోయారు. వెంటనే కేక వేసి మరీ ఆకృత్యాన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందజేశారు. వారు సైకియాను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే.. బాలిక శవంతో శృంగారం చేయాలనుకున్నానని సైకియా అంగీకరించాడు
Recommended Video

పోక్సో యాక్ట్ కింద..
నేరం అంగీకరించడంతో సైకియాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 377, పోక్సో యాక్ట్ సెక్షన్ 8 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివరకు నమోదైన కేసుకు సంబంధించి విచారణ జరుగుతుందని తెలిపారు. దాంతోపాటు బాలిక శవంపై లైంగికదాడికి సంబంధించి.. విచారించి కోర్టులో తగిన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications