ఇక నెలంతా 'రోజా' పరిమళాలే..! నేటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..!!

హైదరాబాద్: ముస్లింలకు పవిత్రమైన పండుగ రంజాన్. ఆకాశంలో నెలవంక సోమవారం రాత్రి కనిపించడంతో మంగళవారం రంజాన్ నెల ప్రారంభమైంది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సమాజంలో సంతోషాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో ప్రజలు ఉపవాసదీక్షలు చేస్తారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి.

ప్రతిరోజూ ఉదయాత్పూర్వం సహరీతో నిష్ఠగా ప్రారంభమై సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ తో దీక్షను ఉపసంహరించుకుంటారు. నెల రోజుల పాటు రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రత్యేక తరావీ నమాజును ముస్లీములు అత్యంత పవిత్రంగా ఆచరిస్తారు. ఈ రాత్రి అన్ని మసీదుల్లోనూ పవిత్ర ఖురాన్ స్తుతిస్తూ తరావీ నమాజును ప్రారంభించారు. సౌదీ జైళ్లలో మగ్గుతున్న 850 మంది భారతీయులను రంజాన్‌ పర్వదినంలోగా వదలిపెట్టడానికి సౌదీ అరేబియా అంగీకరించిందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.

Rosa blossoms entire month.! Ramzan beginning from today..!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+