ఆర్ఆర్ఆర్‌కు గోల్డెన్ ఛాన్స్..!!

న్యూఢిల్లీ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తాను చాటి చెప్పిన మరో మూవీ ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా అందుకున్న బాక్సాఫీస్ కలెక్షన్లు 1,000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటేశాయి. 1,119 కోట్ల రూపాయల క్లోజింగ్ బిజినెస్‌ను రికార్డ్ చేసింది.

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ నటించిన ఈ పాన్ ఇండియా సినిమా తృటిలో ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడుతోంది. అదే సమయంలో న్యూయార్క్ క్రిటిక్స్ నుంచి బెస్ట్ డైరెక్టర్‌ కేటగిరీలో టాప్‌లో నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌలి అందుకున్నారు. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో అత్యుత్తమంగా నిలిచింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్‌లైట్ అవార్డును కూడా అందుకుందీ మూవీ.

RRR nominates in Best Picture Non-English language category of Golden Globes 2023

ఇప్పుడు తాజాగా మరో అరుదైన అవార్డు కోసం ఎంపికైంది. గోల్డెన్ గ్లోబ్స్ 2023కి నామినేట్ అయింది ఈ రాజమౌలి సినిమా. నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ కోసం నామినేట్ అయింది. అదొక్కటే కాదు- బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో కూడా చోటు దక్కించుకుంది. నాటు.. నాటు పాట చిత్రీకరణ- ఈ కేటగిరీలో ఆర్ఆర్ఆర్‌కు చోటు దక్కేలా చేసింది.

నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్‌తో పాటు మరో నాలుగు సినిమాలు సెలెక్ట్ అయ్యాయి. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్, అర్జెంటీనా 1985, క్లోజ్, డెసిషన్ టు లీవ్ సినిమాలు కూడా ఈ కేటగిరిలో బెస్ట్ ఫిల్మ్ కోసం బరిలో దిగాయి. గోల్డెన్ గ్లోబ్స్ 2023 అవార్డును దక్కించుకోవాలంటే- ఆర్ఆర్ఆర్ ఆయా సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం జనవరి 10వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు నిర్వాహకులు.

RRR nominates in Best Picture Non-English language category of Golden Globes 2023

హాలీవుడ్ నుంచి టామ్ క్రూయిజ్ నటించిన టాప్ గన్: మావెరిక్, బాజ్ లుహ్రమన్ మూవీ ఎల్విస్, అవతార్: ది వే ఆఫ్ వాటర్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇతర కేటగిరీల్లో లిమిటెడ్ సిరీస్, ఆంథాలజీ సిరీస్, టెలివిజన్ మోషన్ పిక్చర్ వంటివి ఉన్నాయి. టారోన్ ఎగర్టన్- బ్లాక్ బర్డ్, కోలిన్ ఫిర్త్- ది స్టెయిర్‌కేస్, ఆండ్రూ గ్యారీ ఫీల్డ్- అండర్ ది బ్యానర్ ఆఫ్ హెవెన్, ఇవాన్ పీటర్స్- మాన్‌స్టర్, ది జెఫ్రీ డామర్ స్టోరీ సెబాస్టియన్ స్టాన్ వంటివి పోటీ పడుతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+