Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RRR: ఆర్ఆర్ఆర్ కన్నడ పాట రిలీజ్, మీడియా ప్రశ్నలకు ఒకేఒక్క మాట చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి !

బెంగళూరు: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ కన్నడ సినిమా ప్రమోషన్ కోసం బెంగళూరు వచ్చారు. బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను బెంగళూరులో ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎస్ఎస్ రాజమౌళి వివరించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు తన సోదరుడు, సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి ప్రాణం పోశారని, రెండు నెలల పాటు కష్టపడి రీరికార్డింగ్ చేశారని, ఆ సినిమాకు ఇంకా మంచి సంగీతం ఇవ్వాలని ఆరాటపడుతున్నారని ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. ఆర్ఆర్ఆర్ కన్నడ జనని పాట విడుదల చేసిన తరువాత మీడియా అడిగిన ప్రశ్నలకు ఎస్ఎస్ రాజమౌళి చాలా సింపుల్ గా ఒకేఒక్క మాటతో సమాధానం ఇచ్చేశారు.

 ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు

ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు

బాహుబలి తరువాత ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో తెరకెక్కుతున్న సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కన్నడ ప్రమోషన్ కోసం ఎస్ఎస్ రాజమౌళి బెంగళూరు చేరుకున్నాడు.

 ప్రత్యేక విమానంలో బెంగళూరుకు

ప్రత్యేక విమానంలో బెంగళూరుకు

ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత డీవీవీ. దానయ్య శుక్రవారం మద్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి నేరుగా యశవంతపురంలోని ఓరియన్ మాల్ చేరుకున్న ఎస్ఎస్ రాజమౌళి కేవలం అర్దగంట మాత్రమే ఆయన సన్నిహితులతో మాట్లాడారు.

 కన్నడలోనే మాట్లాడిన రాజమౌళి

కన్నడలోనే మాట్లాడిన రాజమౌళి

బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్బంగా కన్నడలోనే మాట్లాడిన ఎస్ఎస్ రాజమౌళి కన్నడ బాష మీద అభిమానాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.తనకు కన్నడ అంత బాగారాదని, దయచేసి అపార్థం చేసుకోకూడదని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.

 కీరవాణి ప్రాణం పోశారు

కీరవాణి ప్రాణం పోశారు

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎస్ఎస్ రాజమౌళి ఈ సందర్బంగా వివరించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు తన సోదరుడు, సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి ప్రాణం పోశారని, రెండు నెలల పాటు కష్టపడి రీరికార్డింగ్ చేశారని, ఆ సినిమాకు ఇంకా మంచి సంగీతం ఇవ్వాలని ఆరాటపడుతున్నారని ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు.

 మీడియా ప్రశ్నలు

మీడియా ప్రశ్నలు

బెంగళూరులోని హోటల్ లో జనని కన్నడ పాట విడుదల సందర్బంగా ఓరియన్ మాల్ లోని పీవీఆర్ లోని మల్లీఫ్లెక్స్ థియేటర్ కిక్కిరిసోయింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ మీడియా మిత్రులు అనేక ప్రశ్నలు వేసి ఎస్ఎస్ రాజమౌళి నుంచి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించారు.

మీడియా ప్రశ్నలకు సింపుల్ గా సమాధానం చెప్పిన ఎస్ఎస్ రాజమౌళి

మీడియా ప్రశ్నలకు సింపుల్ గా సమాధానం చెప్పిన ఎస్ఎస్ రాజమౌళి

అయితే రాజమౌళి మాత్రం సింపుల్ గా తాను ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడనని, సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇక్కడే జరుగుతుందని, ఆ రోజు జూనియర్ ఎన్ టీఆర్, రామ్ చరణ్ తోపాటు సినిమా నటీనటులు అందరూ ఉంటారని, ఆరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతామని ఎస్ఎస్ రాజమౌళి చాలా సింపుల్ గా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

Recommended Video

    Latest Tollywood Updates : Allu Arjun ఖాతాలో ఓ అరుదైన రికార్డు..! || Oneindia Telugu
    చాలా సంతోషంగా ఉంది

    చాలా సంతోషంగా ఉంది

    ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు చేరుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చక్రవ్యూహ సినిమా నిర్మాత లోహిత్, ఆర్ఆర్ఆర్ సినిమా కర్ణాటక పంపిణిదారుడు, ప్రిస్టేజ్ గ్రూప్ కు చెందిన వెంకట్, కర్ణాటక జూనియర్ ఎన్ టీఆర్ అభిమానుల సంఘం కన్వీనర్ మాణిక్య తదితరులు రాజమౌళిని రిసీవ్ చేసుకుని ఆయన తిరిగి బెంగళూరు నుంచి బయలుదేరే వరకు ఆయన వెంటే ఉన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+