చెక్ డిస్కౌంట్, సహకార బ్యాంకుల మాయాబజార్, జస్ట్ రూ. 1, 000 కోట్లు, ఎలక్షన్స్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీ గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. సరైన పత్రాలు తీసుకోకుండా, పత్రాలు పరిశీలించకుండా సహకార బ్యాంకుల్లో చెక్ ల డిస్కౌంట్ ల రూపంలో ఏకంగా రూ. 1, 000 కోట్లు గోల్ మాల్ జరిగిందని ఐటీ అధికారుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోని 16 సహకార బ్యాంకుల్లో మార్చి 31వ తేదీన ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు దాడులు చేశారు. సహకార బ్యాంకుల్లోని పలు రికార్డులు పరిశీలించిన అధికారుల దిమ్మతిరిగిపోయింది. చలామణిలో లేని కంపెనీల పేరుతో అనుమానాస్పద రీతిలో భారీ మొత్తంలో చెక్ లు డిస్కౌంట్ చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

చెక్ లు డిస్కౌంట్ చేసే సమయంలో సహకార బ్యాంకు అధికారులు, సిబ్బంది ఖాతాదారుల నుంచి నియమాలకు అనుగుణంగా వారి గుర్తింపు పత్రాలు (కేవైసీ) ఏమాత్రం పరిశీలించకుండా, కేవైసీ పత్రాలు తీసుకోకుండా రూ. కోట్లకు రూ. కోట్ల డబ్బు చెక్ డిస్కౌంట్ రూపంలో చేతులు మారాయని, వేరే ఖాతాలకు డబ్బు బదిలి చేశారని, చాలా మందికి నేరుగా డబ్బులు ఇచ్చేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా మోసం చెయ్యడానికి కొన్ని సహకార బ్యాంకుల పరిపాలన విభాగం అధికారులు, బోర్డు సభ్యులు సహకరించారని ఐటీ శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల అక్రమ డబ్బును సక్రమంగా చేసినట్లు నిరూపించడానికి భారీ మొత్తంలో చెక్ డిస్కౌంట్ లు చేశారని ఐటీ శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది.
సహకార బ్యాంకులు సక్రమంగా నియమాలు పాటించకుండా, సరైన పత్రాలు పరిశీలించకుండా, రసీదులు ఇవ్వకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు చెక్ డిస్కౌంట్ రూపంలో రూ. 15 కోట్లకు పైగా రుణాలు ఇచ్చేశారని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.
సహకార బ్యాంకుల్లోని వివిద పేర్లతో ఉన్న అకౌంట్ ల నుంచి, హౌసింగ్ సోసైటీల అకౌంట్ల నుంచి, వివిద భోగస్ కంపెనీల పేర్లతో ఉన్న అకౌంట్ ల నుంచి సుమారు రూ. 1, 000 కోట్లకు పైగా గోల్ మాల్ జరిగిందని వెలుగు చూసింది. సహకార బ్యాంకుల్లో జరిగిన రూ. 1, 000 కోట్ల గోల్ మాల్ వ్యవహారంలోని డబ్బు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications