కర్ణాటక ఎన్నికలు: ప్రైవేటు బస్సులో రూ.100కోట్లకుపైగా నగదు పట్టివేత
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా తిప్పగానిపల్లి వద్ద మంగళవారం తనిఖీలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో వెంకటేశ్వర ట్రావెల్స్ అనే ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ నగదును స్వాధీనం చేసుకుని లెక్కించగా..రూ.100కోట్లకుపైగా ఉన్నట్లు తేలింది.

ఈ నగదును ఎక్కడి నుంచి ఎక్కిడికి తీసుకెళ్తున్నారన్న దానిపై కర్ణాటక పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు ఈ డబ్బు తరలిస్తున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications