రూ. 20-25 వేలకే అమ్మాయిలు: మంత్రి భర్త వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం!
ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య భర్త గిర్దారి లాల్ సాహు చేసిన కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. బీహార్‌కు చెందిన అమ్మాయిలను కేవలం రూ.20 వేలకే పెళ్లికి కొనుక్కోవచ్చని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అసలేం జరిగిందంటే?
గత నెలలో అల్మోరాలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో గిర్దారి లాల్ సాహు ప్రసంగిస్తూ.. వయసు పైబడిన వారు లేదా పెళ్లికాని వారు బీహార్ నుంచి అమ్మాయిలను తెచ్చుకోవచ్చని వ్యాఖ్యానించారు. "మీకు ముసలి వయసులో పెళ్లి కావట్లేదా? అయితే మాతో రండి, బీహార్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. అక్కడ రూ. 20,000 నుంచి రూ. 25,000 కే అమ్మాయిలు దొరుకుతారు" అని ఆయన అనడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన భార్య మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి స్వయంగా ఆమె భర్తే మహిళలను వస్తువుల్లాగా వెలకట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

విపక్షాల నిరసన, బీజేపీ దూరం
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇది కేవలం బీహార్ మహిళలనే కాకుండా దేశంలోని యావత్ మహిళా జాతిని అవమానించడమేనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గోడియల్ విమర్శించారు. "మహిళల గౌరవం పట్ల బీజేపీకి ఉన్న ఆలోచనా విధానానికి ఇది నిదర్శనం. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమ రవాణా)ను ప్రోత్సహించేలా ఉంది" అని మహిళా కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. పరిస్థితి తీవ్రతను గమనించిన బీజేపీ.. గిర్ధారి లాల్ సాహుకు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ఆ వ్యాఖ్యల నుంచి తప్పుకుంది.
Girdhari Lal Sahu, उत्तराखंड सरकार में महिला सशक्तिकरण एवं बाल विकास मंत्री के पति, कहता है: “बिहार में लड़की 20–25 हजार में मिल जाती है” - घिनौनी, अमानवीय सोच.
— Ashok Upadhyay (@ashoupadhyay) January 2, 2026
2014 में बीजेपी नेता O. P. Dhankar ने कहा था: “हरियाणा में दुल्हन न मिले तो बिहार से ले आएँगे।”.
ऐसे मूर्ख, अक्लहीन… pic.twitter.com/rhNtHsfD08
బీహార్ మహిళా కమిషన్ సీరియస్
ఈ వ్యవహారంపై బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ అప్సర మాట్లాడుతూ.. "ఇది ఆయన మానసిక దివాళాకోరుతనానికి నిదర్శనం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ భర్త అయి ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు" అని మండిపడ్డారు. ఈ మేరకు సాహుకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
సాహు క్షమాపణలు
వివాదం ముదరడంతో గిర్ధారి లాల్ సాహు స్పందించారు. తన మాటలను వక్రీకరించారని, కేవలం తన స్నేహితుడి పెళ్లి గురించి సరదాగా మాట్లాడానని చెప్పుకొచ్చారు. "నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను" అని ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications