వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: బాబా రామ్ దేవ్ కంపెనీకి భూములు, రూ. 250 కోట్లు డిస్కౌంట్, బీజేపీ అధికారంలో!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాబా రామ్ దేవ్ కంపెనీలకు భూస్వాధీనం పథకంలో భాగంగా 4.6 కోట్ల అమెరికన్ డాలర్లు (రూ. 250 కోట్లు) తక్కువ ధరకు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు భూములు అప్పగించాయని ఓ మీడియా సంచలన కథనం వెల్లడించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత బాబా రామ్ దేవ్ కంపెనీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభం పొందాయని వెలుగు చూసింది.

రియల్ ఎస్టేట్ ధర

రియల్ ఎస్టేట్ ధర

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులు ప్రభుత్వ భూములను పరిశీలించి రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉన్నాయని అంచనావేసి ప్రభుత్వానికి నివేధిక సమర్పించారు. అధికారులు సూచించిన అతి తక్కువ ధరలకే రామ్ దేవ్ బాబా కంపెనీలకు భూములు అప్పగించారని ఆరోపణలు వస్తున్నాయి.

కేంద్రంలో బీజేపీ

కేంద్రంలో బీజేపీ


కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాబా రామ్ దేవ్ కు చెందిన పతాంజలి సంస్థతో సహ ఆయనకు చెందిన అనేక కంపెనీలు భారీ మొత్తంలో లాభం పొందాయని మీడియా కథనం ప్రచురించింది.

160 కోట్ల అమెరికన్ డాలర్లు

160 కోట్ల అమెరికన్ డాలర్లు

2013లో బాబా రామ్ దేవ్ కంపెనీలు 156 మిలియన్ డాలర్ల లాభాలలో ఉంది. 2015లో తమ కంపెనీల లాభాలు 322 కోట్ల అమెరికన్ డాలర్లకు పెరిగాయని స్వయంగా బాబా రామ్ దేవ్ ప్రకటించారు. అంటే రెండేళ్లలో ఒక్క సారిగా లాభాలు రెట్టింపు ( 160 కోట్ల అమెరికన్ డాలర్లు) అయ్యింది.

2 వేల ఎకరాలు

2 వేల ఎకరాలు

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పతాంజలి కంపెనీకి 2,000 ఎకరాల భూములు అప్పగించారు. 2 వేల ఎకరాల భూముల్లో కట్టడాలు, ఫ్యాక్టరీలు, పరిశోధనా కేంద్రం నిర్మించి ఆయుర్వేదిక్ మూలికలు పెంచడానికి ఉపయోగిస్తున్నారు.

 కాంగ్రెస్ హయాంలో !

కాంగ్రెస్ హయాంలో !

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పతాంజలి సంస్థ భారీ మొత్తంలో భూములు విక్రయించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పతాంజలి భారీ మొత్తంలో ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంది.

రెండు రాష్ట్రాలు

రెండు రాష్ట్రాలు

పతాంజలికి 2,000 ఎకరాలు స్వాధీనం చేసుకున్న రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వ భూములు మార్కెట్ ధరకంటే 77 శాతం తక్కువ ధరకు (రాయితీ)లో పతాంజలి కంపెనీకి అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి.

లక్ష కోట్ల అమెరికన్ డాలర్లు

లక్ష కోట్ల అమెరికన్ డాలర్లు


పతాంజలి కంపెనీలు, ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వాలకు చెప్పి మార్కెట్ ధర కంటే రూ. లక్ష కోట్ల అమెరికన్ డాలర్ల తక్కువ ధరకు రాయితీలో బాబా రామ్ దేవ్ భూములు స్వాధీనం చేసుకున్నారని మీడియా ఓ సంచలన కథనం వెల్లడించింది .

English summary
Baba Ramdev's company is alleged to have received more than 46 million dollars in discount for land acquisitions in states controlled by the BJP, a media report stated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X