Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, స్వామి దర్శనం కోసం, లక్ష మందికి !
శబరిమల/తిరువనంతపురం: భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన శబరిమల అయ్యప్పస్వామిని దర్శించకోవడానికి అయ్యప్పస్వామి భక్తులు పోటీ పడుతున్నారు. ఒక్క రోజులో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి లక్ష మంది అయ్యప్ప భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోవాలని అనుకునే భక్తులు ప్రస్తుతం ఆన్ లైన్ లో ఎక్కువగా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఒకే రోజు అయ్యప్ప దర్శనం కోసం లక్ష మందికి పైగా ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

కోట్లాది మంది భక్తులు
కేరళలోని అయ్యప్పస్వామికి భారతదేశంలో పాటు విదేశఆల్లో కోట్లాది మంది భక్తులు ఉన్న విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం అయ్యప్పస్వామిని దర్శించుకోవాలని కోట్లాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కరోనా వైరస్ కారణంగా అయ్యప్పస్వామి దర్శనం చేసుకోవడానికి అయ్యప్ప భక్తులకు నానా ఇబ్బందులు ఎదురైనాయి.

ఆన్ లైన్ లో స్వామి దర్శనం కోసం టిక్కెట్లు
తరువాత అయ్యప్పస్వామి దర్శనం కోసం వేచి చూసే భక్తులు శబరిమల చేరుకోవడానికి ఆన్ లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి కేరళ ప్రభుత్వం అవకాశం కల్పించింది. శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోవాలని అనుకునే భక్తులు ప్రస్తుతం ఆన్ లైన్ లో ఎక్కువగా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు.

ఒకే రోజు లక్ష మంది భక్తులు
శబరిమలలోని శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి డిసెంబర్ 13వ తేదీకి 77, 216 మంది, డిసెంబర్ 14వ తేదీకి 64, 517 మంది ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే సోమవారం (డిసెంబర్ 12వ తేదీ) శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోవడానికి ఏకంగా 1, 07, 260 మంది అయ్యప్ప భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్క చేసుకున్నారు.

దేవాదాయ శాఖ
అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి లక్ష మంది భక్తులు ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారని, భక్తులకు అయ్యప్ప దర్శనం చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామి కేరళ దేవాదాయా శాఖా మంత్రి కే రాధాక్రిష్ణన్ మీడియాకు చెప్పారు. భక్తులు అందరూ అయ్యప్పస్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పించడానికి అదనంగా సమయం కేటాయించామని దేశాదాయ శాఖ, శబరిమల దేవాలయం ప్రత్యేక అధికారి హరిశ్చంద్ర నాయక్ సోమవారం మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications