Sadist: పోస్టుమార్టుం రూమ్ లో మహిళలను నగ్నంగా చేసి వీడియోలు తీసిన ఉద్యోగి, వీడు !
బెంగళూరు/మడికేరి: ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి ఇంట్లోకి చొరబడిన మార్చురీలో పని చేస్తున్న యువకుడు అసభ్యంగా ప్రవర్తించి జైలుపాలైనాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన యువకుడు మాయం అయ్యాడు. యువకుడి మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. పోస్టుమార్టం నిర్వహించే మార్చురీలో మహిళల శవాలను నగ్నంగా వీడియోలు తీసిన కామాంధుడు లెక్కలేనన్ని వీడియోలు మొబైల్ లో సేవ్ చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

ప్రభుత్వ ఆసుపత్రిలో ?
కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని మడికేరి ప్రభుత్వ ఆసుపత్రిలో సయ్యద్ హుస్సేన్ అలియాస్ సయ్యద్ (30) అనే యువకుడు పోస్టుమార్టం నిర్వహించే గదిలో విధులు నిర్వహించాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులతో మార్చురీలో పని చేస్తున్న సయ్యద్ అసభ్యంగా ప్రవర్తించాడు.

మహిళ ఇంట్లోకి చొరబడి ?
ఆసుపత్రుల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను ఎవ్వరూలేని గదిలోకి రావాలని పిలిచిన సయ్యద్ వారిని టార్చర్ పెట్టాడు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న మహిళ ఇంట్లోకి చొరబడిన సయ్యద్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ సందర్బంలో మహిళ గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు సయ్యద్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

మొబైల్ లో వీడియోలు, ఫోటోలు చూసి పోలీసులు షాక్
పోలీసులు సయ్యద్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. సయ్యద్ జైలు నుంచి విడుదలైనాడు. సయ్యద్ మొబైల్ ఫోన్ అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ తీసుకోవడానికి సయ్యద్ రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. సయ్యద్ మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు బిత్తరపోయారు.

కరోనా ఫ్రంట్ వర్కర్ గా పని చేసి ?
మడికేరి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో 2021లో సయ్యద్ కరోనా ఫ్రంట్ వర్కర్ గా విధులు నిర్వహించాడు. ఆ సందర్బంలో కరోనాతో చనిపోయిన మహిళలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మహిళల శవాల దగ్గర ఉన్న సయ్యద్ చనిపోయిన మహిళలన నగ్నంగా చేసి వీడియోలు తీసి అతని మొబైల్ లో స్టోర్ చేశాడు.

పోస్టుమార్టుం రూమ్ లో ?
పోస్టుమార్టుం నిర్వహించే మార్చురీలో మహిళల శవాలను నగ్నంగా వీడియోలు తీసిన కామాంధుడు సయ్యద్ లెక్కలేనన్ని వీడియోలు మొబైల్ లో సేవ్ చేశాడని వెలుగు చూడటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. మడికేరి మార్చురీలో సయ్యద్ చాలా మంది మహిళ నగ్న వీడియోలు తీశాడని కలకలం రేపింది.












Click it and Unblock the Notifications