ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సల్మాన్ ఖాన్ బావ ఆయూష్?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బావ ఆయూష్ శర్మ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ మీద పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సల్మాన్ సోదరి అర్పిత

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బావ ఆయూష్ శర్మ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ మీద పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సల్మాన్ సోదరి అర్పితను ఆయూష్ శర్మ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా, ఆయూష్ శర్మ తండ్రి అనిల్ శర్మ తాజాగా బీజేపీలో చేరారు. హిమాచల్ ప్రదేశ్‌లోని వీరభద్రసింగ్ ప్రభుత్వంలో కీలక కేబినెట్ మంత్రి కొనసాగుతున్న అనిల్ శర్మ కాంగ్రెస్ పార్టీకి ఝలకిచ్చి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుఖ్రామ్ కుమారుడైన అనిల్ శర్మ సీఎం వీరభద్ర సింగ్‌ కేబినెట్‌లో కీలక మంత్రి.

Salman Khan's Brother-in-Law Ayush Sharma May Contest Himachal election

బీజేపీలో చేరిన తనకు మాండీ టికెట్‌ను పార్టీ అధినాయకత్వం ఖాయం చేసిందని అనిల్ శర్మ స్పష్టం చేశారు. అదే సమయంలో మీ కుమారుడు ఆయూష్ శర్మకు కూడా టికెట్ లభించే అవకాశం ఉందా? అని మీడియా ప్రశ్నించగా.. అది బీజేపీ నాయకత్వం నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. కాగా, తనకు, తన కుమారుడు ఆయూష్ శర్మకు టికెట్ ఖరారు చేసుకున్న తర్వాతే బీజేపీలో అనిల్ శర్మ చేరినట్లు ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+