లుంగీ విప్పేసి మంత్రి డ్యాన్స్, నెట్లో వీడియో హల్‌చల్
లక్నో: మంత్రి పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు తన హోదాను మరిచిపోయి, చిల్లర వేషాలు వేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఏకంగా లుంగీ విప్పేసి అసభ్యకరంగా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో హల్‌చల్ సృష్టిస్తోంది.
సమాజ్‌వాది పార్టీకి చెందిన నేత, మంత్రి మొహమ్మద్ ఫారుక్ హసన్ ఈ లుంగీ డ్యాన్స్ చేశాడు. దీనిని గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి, నెట్లో పెట్టారు. అతను ఎక్కడ ఈ డ్యాన్స్ చేశాడో స్పష్టంగా తెలియదు.

ఆ వీడియోలో మంత్రి బనియన్, లుంగీతో ఉన్నాడు. పాటలకు స్టెప్పులు వేసి అదరగొట్టాడు. అక్కడున్న వారు అతని డ్యాన్స్ చూసి చప్పట్లు కొట్టారు. డ్యాన్స్ మధ్యలో సోఫాలో పడిపోయిన ఆయన, మళ్లీ లేచి లుంగీ విప్పిసి, కట్టుకొని స్టెప్పులేశారు. దీనిపై హసన్ మాట్లాడుతూ.. ఇది తనపై జరిగిన కుట్ర అన్నారు. తనను కొందరు యువకులు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశారని, వారు చేసి ఉంటారన్నారు.












Click it and Unblock the Notifications