lockdown:సమోస, గుట్కా, పిజ్జా, పాన్, ఐస్‌క్రీమ్.. యూపీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ల మోత...
కరోనా వైరస్ ప్రళయ విలయం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ అధికారులు హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. 1076 నంబర్‌కు ఫోన్ చేసి వైద్య సాయం కోసం కోరాలని సూచించారు. కానీ కొందరు మాత్రం చిత్ర, విచిత్రంగా మాట్లాడుతున్నారు.

మందులు..
రామ్ రతన్ లాల్ అనే వ్యక్తి హై బ్లడ్ ప్రెషర్‌తో బాధపడుతున్నారు. తన మందులు అయిపోవడంతో ఫోన్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేశారు. వెంటనే కంట్రోల్ రూం అధికారులు స్పందించి.. మందులను పంపించే ఏర్పాట్లు చేశారు. గౌతమ్ బుద్ద్ నగర్‌కి చెందిన శంకర్ సింగ్ కూడా ఆహార పదార్థాల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేశారు. వీరిలాగే లక్ష మంది వరకు సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు.

రసగుల్లా..
అయితే మరికొందరు మాత్రం విచిత్రమైన కోరికలు కోరుతున్నారు. ఓ వృద్దుడు తనకు రసగుల్లా కావాలని రిక్వెస్ట్ చేశాడు. వాస్తవానికి అది ఫేక్ కాల్ అని భావించారు.. కానీ లక్నో హజరత్ గంజ్‌కి చెందిన 80 ఏళ్ల వృద్దుడికి స్వీట్లు అవసరం ఉన్నాయని తెలిపింది. అతను డయాబెటిస్ అని.. అతని శరీరంలో షుగర్ స్థాయి పడిపోవడంతో స్వీట్ ఆర్డర్ చేశాడని తెలిసింది.

గుట్కా, సమోస
పోలీసు హెల్ప్ లైన్ నంబర్ 112కు చాలామంది ఫోన్ చేసి గుట్కా, చట్నీతో సమోస ఆర్డర్ చేశారు. అతని కోరిక మేరకు సమోసలు కూడా అందజేశారు. రాంపూర్‌లో ఒకరు తమకు పిజ్జా కావాలని కోరారు. ఇలా రకరకాల వస్తువులు కావాలని ఫోన్ చేస్తున్నారు. మరికొందరు ఔత్సాహికులు ముందుకొచ్చి మందు కావాలని కూడా అడగడం విశేషం. చిన్నారులు చిప్స్, కేక్స్, ఐస్ క్రీమ్, పిజ్జాలు కావాలని అడుగుతున్నారు.

ఫుడ్..
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు ఉండటంతో యూపీలో 35 వేల మంది పోలీసు రెస్పాన్స్ వెహికిల్ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసిన వారికి ఆహార పదార్థాలు, మందులు అందజేసే బాధ్యత అప్పగించారు.
Recommended Video
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications