Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయోధ్య రామ మందిరం రోజే చిరంజీవి ఫ్యామిలీలో స్టార్ హీరో పిల్లలకు నామకరణం,యాక్షన్ కింగ్!

అయోధ్యలో శ్రీరామభక్తుల ఉత్సవం తారాస్థాయికి చేరుకుంది. అయోధ్య రామమందిరం రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూసేందుకు యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలైనాయి. దేశంలోని నలుమూలల ప్రజలు ఈరోజు రామనామ జపం చేస్తున్నారు.

మరోవైపు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు సినీ తారలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు అయోధ్య రావాలని ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఈ శుభ సందర్బంగా స్యాండిల్ వుడ్ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా శ్రీరామ భక్తుడు, ఆంజనేయ భక్తుడు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ఈ ధృవ సర్జా. అయోధ్యలో రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగే రోజునే తన పిల్లలకు నామకరణం చేయాలని ధృవ సర్జా నిర్ణయించుకున్నారు.

Sandalwood star hero naming his children on the opening day of Ayodhya Ram Mandir

ఆంజనేయుడు, శ్రీరాముని భక్తులైన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుటుంబంలోని ధృవ సర్జా ఈ పవిత్రమైన రోజున తమ పిల్లలకు నామకరణం చేయడం మంచిదని భావించారు. యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా, ప్రేరణ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు పుట్టినా ఇంత వరకు ఎందుకు నామకరణం చెయ్యలేదని ధృవ సర్జాను ఆయన అభిమానులు చాలా కాలం నుంచి అడుగుతున్నారు. మంచి రోజు, సమయం చూసి తన పిల్లలను నామకరణం చేస్తానని ఇంతకాలం ధృవ సర్జా చెబుతూ వచ్చారు.

కూతురు పుట్టిన తర్వాత కొడుకు పుట్టినా ధృవ సర్జా ఇద్దరికి ఇంతకాలం నామకరణం చెయ్యలేదు. ఇంతకాలం అభిమానులు సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ధృవ సర్జాకు 2022 అక్టోబర్ 2వ తేదీ ఒక కూతురు, 2023 సెప్టెంబర్‌లో ఒక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ముహూర్తంలోనే తన పిల్లలకు నామకరణం చెయ్యాలని నిర్ణయించిన ధృవ సర్జా ఆ శుభకార్యానికి శ్రీకారం చుట్టారు.

ఈ ప్రత్యేకమైన రోజున పిల్లలు ఇద్దరికీ నామకరణం చేయాలని ధృవ సర్జా నిర్ణయించుకున్నారు. ధృవ సర్జా ఫామ్ హౌస్ లో పాప పేరు పెట్టే కార్యక్రమం జరగనుందని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుటుంబ సభ్యులు, ధృవ సర్జా పాల్గొననున్నారు. ఇటీవల మరణించిన హీరో చిరంజీవి సర్జాకు స్వయానా ధృవ సర్జా సోదరుడు. చిరంజీవి సర్జా, ధృవ సర్జా ఒకే తల్లి బిడ్డలు. ధృవ సర్జా సర్జా కుటుంబం ఆంజనేయ, శ్రీరామ భక్తులు కావడంతో పిల్లలకు రామాయణానికి సంబంధించిన పేర్లు పెట్టినట్లు ధ్రువ సర్జా సన్నిహితులు చెబుతున్నారు.

Sandalwood star hero naming his children on the opening day of Ayodhya Ram Mandir

మరి కొద్ది గంటల్లో ధృవ సర్జా పిల్లల పేర్లు కూడా వెల్లడి కానున్నాయి. ధృవ సర్జా తరచూ తన పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ధృవ సర్జాకు ఆయన ఇద్దరూ పిల్లలతో చాలా అట్యాచ్ మెంట్ ఉన్న విషయం ఆయన అభిమానులకు కొత్తగా చెప్పనసవరం లేదు వీలు చిక్కినప్పుడు ధృవ సర్జా ఆయన ఇద్దరు పిల్లల ఫోటోలు సోషలక మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు.

ధృవ సర్జా ఆయన పిల్లలకు ఆంజనేయుడు, శ్రీరాయుడి పేర్లు కలిసి వచ్చేలా ఎలాంటి పేర్లు పెడుతారు అని తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధృవ సర్జా ప్రస్తుతం రెండు ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. కేడీ అనే సినిమా విడుదలకు సిద్దం అవుతుండగా మరో సినిమా దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+