Wife: రిటైడ్ ఐఏఎస్ తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని నా భర్త టార్చర్ పెట్టాడు, రైంజ్ పెరుగుతోందని !

మా ఇంటికి వస్తున్న ఓ మాజీ ఐఏఎస్ అధికారి పక్కన పడుకుని ఆయనకు పడక సుఖం ఇవ్వాలని, అందంగా ఉన్న నువ్వు నేను చెప్పిన అధికారులకు పడక సుఖం ఇస్తే మన జీవితాలు సెటిల్ అయిపోతాయని తన భర్త స్యాంట్రో రవి తన మీద ఒత్తిడి చేశాడనిఅతనిభార్య

బెంగళూరు/మైసూరు: రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, ప్రజలకు సినిమా చూపించి తనకుంటే ప్రత్యేకత చాటుకున్న స్యాంట్రో రవి మీద అతని భార్య బాంబు పేల్చింది. మా ఇంటికి వచ్చి వెలుతున్న ఓ మాజీ ఐఏఎస్ అధికారి పక్కన పడుకుని ఆయనకు పడక సుఖం ఇవ్వాలని తన భర్త స్యాంట్రో రవి తన మీద ఒత్తిడి చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అందంగా ఉన్న నువ్వు నేను చెప్పిన అధికారులకు పడక సుఖం ఇస్తే మన జీవితాలు సెటిల్ అయిపోతాయని, మనం హ్యాపీగా ఉండటానికి మంచి చాన్స్ వస్తుందని తన భర్త తనతో వ్యభిచారం చేయించడానికి చాలాసార్తు తన మీద ఒత్తిడి చేశాడని స్యాంట్రో రవి భార్య క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఆమె స్టేట్ మెంట్ ఇవ్వడం కలకలం రేపింది.

మాజీ ఐఏఎస్ అధికారికి పడక సుఖం ?

మాజీ ఐఏఎస్ అధికారికి పడక సుఖం ?

రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఏకాంతంగా గడిపేందుకు తన మీద తన భర్త స్యాంట్రో రవి ఒత్తిడి చేశాడని, అందుకు నేను అంగీకరించకపోవడంతో తన మీద తన భర్త తప్పుడు దోపిడీ కేసు పెట్టి జైలుకు పంపించాడని అతని భార్య బెంగళూరు సీసీబీ విచారణలో సంచలన స్టేట్ మెంట్ ఇచ్చిందని వెలుగు చూసింది. తనపై బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన దోపిడీ కేసుకు సంబంధించి బెంగళూరు సీసీబీ పోలీసుల ముందు స్యాంట్రో రవి భార్య విచారణకు హాజరైంది.

హైటెక్ వ్యభిచారం చెయ్యాలని నా భర్త చెప్పాడు

హైటెక్ వ్యభిచారం చెయ్యాలని నా భర్త చెప్పాడు

కేస్ మంజునాథ్ అలియాస్ స్యాంట్రో రవి భార్యను సీసీబీ పోలీసులు సుమారు మూడు గంటలకు పైగా విచారణ చేసి వివరాలు సేకరించారు.

తాను ఏ తప్పూ చేయలేదని స్యాంట్రో రవి భార్య పోలీసులకు చెప్పింది. నా భర్త రవి నన్ను బలవంతంగా వ్యభిచారంలోకి దింపేందుకు ప్రయత్నించాడు. దీనికి నేను అభ్యంతరం చెప్పాను. మా ఇంటికి వస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో పాటు చాలా మందితో తనను ఏకాంతంగా గడపాలని నా భర్త నాకు ఉచిత సలహాలు ఇచ్చాడని స్యాంట్రో రవి భార్య బాంబు పేల్చిందని వెలుగు చూసింది.

ఇన్స్ పెక్టర్, నా భర్త ఫ్రెండ్స్

ఇన్స్ పెక్టర్, నా భర్త ఫ్రెండ్స్

అందంగా ఉన్న నువ్వు నేను చెప్పిన అధికారులకు పడక సుఖం ఇస్తే మన జీవితాలు సెటిల్ అయిపోతాయని, మనం హ్యాపీగా ఉండటానికి మంచి చాన్స్ వస్తుందని తన భర్త తనతో వ్యభిచారం చేయించడానికి చాలాసార్తు తన మీద ఒత్తిడి చేశాడని స్యాంట్రో రవి భార్య క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఆమె స్టేట్ మెంట్ ఇవ్వడం కలకలం రేపింది. నా భర్త స్యాంట్రో రవి చెప్పినట్లు తాను హైటెక్ వ్యభిచారం చెయ్యడానికి ఒప్పుకోకపోవడంతో బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌తో కలిసి నాపై తప్పుడు దోపిడీ కేసు నమోదు చేసి జైలుకు పంపారని స్యాంట్రో రవి భార్య బెంగళూరు సీసీబీ పోలీసులకు చెప్పిందని సమాచారం.

నేరుగా ఇంటికే పిలుచుకుని వచ్చాడు

నేరుగా ఇంటికే పిలుచుకుని వచ్చాడు

దోపిడీ జరిగిన రోజున తాను మైసూర్‌లో ఉన్నట్లు ఆధారాలను సీసీబీ పోలీసులకు ఆమె సమర్పించింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత బాధితురాలు మీడియా ముందు ఆమె భర్త స్యాంట్రో రవి మీద ఆరోపణలు చేసింది. సీసీబీ విచారణ సమీపంలో శాంత్రో రవి భార్య విలేకరులతో మాట్లాడుతూ నా భర్త స్యాంట్రో రవితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బెంగళూరులోని మా ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడని చెప్పింది.

ఫోన్ నెంబర్ ఇచ్చి ఏం చెప్పాడంటే

ఫోన్ నెంబర్ ఇచ్చి ఏం చెప్పాడంటే

తరువాత మేము మైసూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత తన భర్త స్యాంట్రో రవి నాకు రిటైర్డ్ అధికారి మొబైల్ నంబర్ ఇచ్చి ఆ అధికారితో మాట్లాడాలని, ఆయనతో చాటింగ్ చేయమని సూచించాడని, కొన్ని రోజుల తరువాత అదే మాజీ ఐఏఎస్ అధికారితో ఏకాంతంగా గడిపి అతనికి పడక సుఖం ఇవ్వాలని సూచించాడని స్యాంట్రో రవి మీద ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను చెప్పినట్లు రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ప్రభుత్వం ఉద్యోగులతో పరిచయాలు పెరుగుతాయని తన భర్త స్యాంట్రో రవి తనకు మాయమాటలు చెప్పాడని ఆమె ఆరోపించింది.

నీ అక్రమ సంబంధంతో మన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది

నీ అక్రమ సంబంధంతో మన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది

తరువాత మనస్థాయి ఎక్కడికో వెళ్లిపోతుందని తన భర్త స్యాంట్రో రవి తనకు చెప్పాడని అతని భార్య మీడియా ముందు చెప్పింది. అయితే తన భర్త చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేతని తాను అభ్యంతరం వ్యక్తం చేశానని, అప్పుడు ఆయనకు కోపం వచ్చి నాపై దాడి చేశాడని స్యాంట్రో రవి భార్య ఆరోపించింది. నాకు చాలా మంది పోలీసు అధికారులు తెలుసు, నీ అంతు చూస్తాను అంటూ బెదిరించాడని తరువాతే తన మీద బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదైయ్యిందని స్యాంట్రో రవి భార్య ఆరోపించింది.

నా చెల్లెలి జీవితంతో చెలగాటం ఆడుకున్నాడు

నా చెల్లెలి జీవితంతో చెలగాటం ఆడుకున్నాడు

తననే కాదు, తన సోదరిని కూడా తన భర్త స్యాంట్రో రవి వేధింపులకు గురి చేశాడని, మైసూర్‌లో ఆమెన నకిలీ దోపిడీ కేసులో అరెస్టు చేయించాడని అతని భార్య ఆరోపించింది. ఆ రోజు మమ్మల్ని మైసూర్ నుంచి బెంగళూరు తీసుకొచ్చిన పోలీసుల ముందు మేం తప్పు చేయలేదని చెప్పినా వినలేదు. స్టేషన్‌కు వచ్చిన ఏసీపీ ముందు కూడా అడగకుండా మమ్మల్ని జైలుకు పంపారని స్యాంట్రో రవి భార్య లు వాపోయింది. నెల రోజుల క్రితం నా భర్త స్యాంట్రో రవి నా మొబైల్‌ లాక్కొని తనను ఇంటి నుంచి బయటకు గెంటేశాడని అతని భార్య ఆరోపించింది.

నా మొబైల్ ఫోన్ తో డ్రామాలు

నా మొబైల్ ఫోన్ తో డ్రామాలు

తన మొబైల్ ఫోన్ ఉపయోగించిన తన భర్త స్యాంట్రో రవి తాను బెంగళూరులో ఉన్నట్లు తప్పుడు ఆధారాలు సృష్టించి నన్ను కేసులో ఇరికించారని, ఆ సంఘటన జరిగిన రోజు నేను మైసూర్‌లో ఉన్నట్లు ఆధారాలను సీసీబీ పోలీసు అధికారులకు సమర్పించానని బాధితురాలు మీడియాకు చెప్పింది. స్యాంట్రో రవితో కలిసి అతని భార్య మీద తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాటన్ పేట్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌కు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి శుక్రవారం విచారకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి రావడంతో కాటన్ పేట్ ఇన్స్ పెక్టర్ ప్రవీణ్‌ని పై అధికారులు సస్పెండ్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+