సూపర్ స్టార్ మీద శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, జయ దెబ్బతో రజనీ విదేశాలకు !

చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై బహుబాష నటుడు శరత్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ సందర్భాన్ని బట్టి రాజకీయాలు చేస్తున్నారని శరత్ కుమార్ మండిపడ్డాడు. సమతువ మక్కల్ కట్చి పార్టీ అధినేత అయిన శరత్‌ కుమార్‌ మంగళవారం చెన్నైలోని చప్పక్ లో ఆర్ టీసీ బస్సు చార్జీల ధరలు తగ్గించాలని నిర్వహించిన ధర్నాలో పాల్గొనడానికి సైకిల్ మీద వచ్చారు.

ఈ సందర్భంగా రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై శరత్‌ కుమార్‌ స్పందించారు. రజనీకాంత్‌ సందర్భవాద రాజకీయాలు చేస్తున్నారని, అసలు రజనీకాంత్ చూపించే గుర్తు బాబాది కాదని, అది మేక తలకాయ, అదీ ఓ సోసైటీకి చెందిన సింబల్‌ అంటూ శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sarathkumar questions about Rajini's stand in Cauvery issue.

కావేరి జల వివాదంపై రజనీకాంత్ తన వైఖరి ఏమిటో స్పష్టం చెయ్యాలని శరత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కర్ఱాటకలో పుట్టి తమిళనాడులో డబ్బు సంపాధించిన రజకీకాంత్ ఇక్కడి రైతులకు న్యాయం చెయ్యడానికి కావేరీ నీటి కోసం పోరాటం చెయ్యడానికి సిద్దంగా ఉన్నారా అని శరత్ కుమార్ ప్రశ్నించారు.

1996లో జయలలితకు దెబ్బకు విదేశాలకు పారిపోయిన రజనీకాంత్ తరువాత కరుణానిధి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే చెన్నై తిరిగి వచ్చాడని, ఆయన అవకాశ వాద రాజకీయాలతో లాభం పొందాలని చూస్తున్నాడంటూ శరత్‌ కుమార్‌ మండిపడ్డారు. ప్రస్తుతం శరత్ కుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలపై తమిళనాడులో తీవ్రస్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+