వైరల్ వీడియో: కాంగ్రెస్ నేతకు చీర కట్టిన బీజేపీ నేతలు

కాంగ్రెస్ నేతకు చీర కట్టిన బీజేపీ నేతలు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముంబై లోని డోంబివాలీకి చెందిన ప్రకాశ్ అలియాస్ మామా పగారే అనే కాంగ్రెస్ నేత ప్రధాని మోదీపై అసభ్యంగా పోస్టులు పెట్టారు. ప్రధాని మోదీకి చీర కట్టుకున్నట్లుగా మార్ఫింగ్ వీడియో క్రియేట్ చేసి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ కావడంతో ఆగ్రహించిన స్థానిక బీజేపీ నేతలు ప్రకాశ్ అలియాస్ మామా పగారేపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో ప్రతీకారంగా ప్రకాశ్ కు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చీర కట్టారు బీజేపీ నేతలు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Saree Retribution BJP Cadres Force 73-YO Congress Leader into Sari Over Modi Morph Video

ముంబైలోని డోంబివాలీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రకాశ్ అలియాస్ మామా పగారే(75) ఇటీవల ప్రధాని మోదీపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారం స్థానికంగా పెద్ద దుమారంగా మారింది. ప్రధాని మోదీ చీరలో ఉన్నట్లుగా మార్ఫింగ్ వీడియోను రూపొందించి.. దాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు పగారే. దానికి క్యాప్షన్ గా 'సారీ గర్ల్స్.. నేనూ ట్రెండింగ్ లో ఉండాలి కదా' అని ఇచ్చారు.

ఈ పోస్టుపై స్థానికంగా ఉద్రిక్తతలు చెలరేగాయి. పగారేపై కక్ష పెంచుకున్న బీజేపీ నేతలు అతడ్ని పట్టుకుని పబ్లిక్ లో అందరూ చూస్తుండగానే చీర కట్టారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. అయితే బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీ సీనియర్ నేతలను సామాజిక మాధ్యమాల్లో అవమానపరిస్తే ఇలానే శిక్ష విధిస్తామని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+