ఫాస్టాగ్ పై కేంద్రం శుభవార్త: ఇక నో టోల్ గేట్స్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ దేశంలోని అన్ని టోల్ గేట్ల వద్ద అందుబాటులోకి రానుంది. 2026 చివరి నాటికి దీన్ని అమలు చేయాలని ఉపరితల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. భవిష్యత్తులో ఏఐ, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ద్వారానే టోల్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. టోల్ ఛార్జీల వసూళ్లు AI ఆధారిత వ్యవస్థల ద్వారానే జరుగుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఈ నూతన టోల్ విధానం శాటిలైట్, AI సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో కూడా సునాయాసంగా దాటిపోవచ్చు. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టోల్ వ్యవస్థ ద్వారా 1,500 కోట్ల రూపాయల మేర ఇంధనం ఆదా అవుతుంది. ప్రభుత్వానికి అదనంగా రూ. 6,000 కోట్ల రూపాయలు సమకూరుతాయని నితిన్ గడ్కరీ అంచనా వేశారు. వాహనదారులు, కేంద్ర ప్రభుత్వానికి లాభదాయకంగా విన్ టు విన్ విధానంలో ఉంటుందని చెప్పారు.

AI టోల్ కలెక్షన్లు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో విధానం కింద పనిచేస్తుంది. జాతీయ రహదారులపై టోల్ బూత్‌లు ఉండవు. వాటి స్థానంలో గాంట్రీ గేట్స్ నిర్మితమౌతాయి. ఈ గాంట్రీ గేట్లపై హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లను అమర్చుతారు. ఒక వాహనం గరిష్ట వేగంతో వెళ్లినప్పటికీ.. దాని నంబర్ ప్లేట్ ను గుర్తించి, విశ్లేషిస్తాయి. ఈ వ్యవస్థ ఆయా గేట్ల ఎంట్రీ/ఎగ్జిట్ లల్లో అమర్చుతారు. టోల్ ఛార్జీలు పూర్తిగా ఆటోమేటిక్‌గా వసూలు అవుతాయి.
ఈ ఆటోమేటెడ్ ప్రక్రియ వల్ల వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రస్తుత ఫాస్టాగ్, జీపీఎస్ వ్యవస్థల కంటే పూర్తి భిన్నం. ఫాస్టాగ్ అనేది ఆర్‌ఎఫ్‌ఐడీ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. దీనికోసం వాహనం కొన్ని నిమిషాల పాటు టోల్ గేట్ వద్ద ఆగడం తప్పనిసరి. దీంతో పాటు విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ స్టిక్కర్, టోల్ గేట్లు అవసరం. జీపీఎస్ వ్యవస్థకు శాటిలైట్ ట్రాకింగ్, ఓబీయూ పరికరం అవసరం. ఈ విధానంలో వాహనం ఆగనక్కర్లేదు. దూరాన్ని బట్టి ఛార్జీ, గేట్ ఫ్రీ టెక్నాలజీ ఉంటాయి.
AI- ఆధారిత మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో వ్యవస్థలో కెమెరా, దాని విజన్‌పై ద్వారా నంబర్ ప్లేట్ ను గుర్తిస్తారు. దీనికోసం కూడా వాహనం ఆగనక్కర్లేదు. ఏఐ కెమెరా నంబర్ ప్లేట్‌ను గుర్తిస్తుంది. దూరాన్ని బట్టి ఛార్జీ, గేట్ ఫ్రీ సాంకేతికత ద్వారా విశ్లేషించిన అనంతరం ఫాస్టాగ్‌లోని బ్యాలెన్స్ ను తీసుకుంటుంది. బ్లాక్‌లిస్ట్ సమస్యలు కూడా ఉండవు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications