వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం కేసు తుది తీర్పు: రామలింగరాజు సహా పదిమంది దోషులే

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సత్యం కుంభకోణం కేసులో న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రామలింగ రాజును సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. రామలింగ రాజు నేరం చేసినట్లు కోర్టు నిర్ధారించింది. రామలింగ రాజు సహా పదిమందిని కోర్టు దోషులుగా చెప్పింది.న్యాయమూర్తి చక్రవర్తి 46 పేజీల తీర్పును వెల్లడించారు.

రామలింగ రాజుతో పాటు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, సత్యనారాయణ రాజు, గోపాల కృష్ణన్, ప్రభాకర్ గుప్త, శ్రీశైలం తదితర పదిమందిని కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి ఏడు నుండి పదేళ్ల జైలు శిక్ష పడవచ్చునని తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టైన రామలింగ రాజు 2011లో బెయిల్ పైన విడుదలయ్యాడు.

వీరి పైన 120బీ, 420, 409, 419, 467, 468, 478 తదితర సెక్షన్ల కింద్ కేసు నమోదు చేశారు. సీబీఐ 3038 డాక్యుమెంట్లు సమర్పించింది. మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసింది. ఈ సెక్షన్ల కింద సుమారు ఏడేళ్లు జైలు శిక్ష పడవచ్చునని అంటున్నారు. మరోవైపు, దీనిపై వారు పైకోర్టుకు వెళ్లవచ్చా లేదా చూడాల్సి ఉంది.

Satyam scam case: Ramalinga Raju convicted

2009లో బయటపడిన కుంభకోణం

సత్యం కుంభకోణం కేసు 2009 జనవరి 7న బయటకు వచ్చింది. ఆరు నెలల క్రితం వాదనలు పూర్తయ్యాయి. సత్యం భారీ కుంభకోణమని, ఈ స్కాంలో రూ.14వేల కోట్ల మోసం జరిగినట్లు సీబీఐ ఆరోపించింది. మొత్తం 216 మందిని విచారించారు. 3వేలకు పైగా డాక్యుమెంట్లు సమర్పించింది. ఈ కేసు విచారణ ఐదేళ్ల పాటు సాగింది.

ఈ కేసులో రామలింగ రాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, గోపాలకృష్ణ, రాజు, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు నిందితులుగా ఉన్నారు. రామలింగ రాజు తదితరులు ఈ కేసుకు సంబంధించి జైలు జీవితం గడిపారు. సత్యం రామలింగ రాజు అక్రమంగా రెండువేల రూపాయలకు పైగా సంపాదించినట్లు సీబీఐ ఆరోపించింది. కాగా, సీబీఐ దర్యాఫ్తు 2009 ఫిబ్రవరి 16న ప్రారంభమైంది.

తుది తీర్పుపై వాయిదాలు

వాస్తవానికి ఈ కేసులో 2014 అక్టోబర్ 30న తీర్పు వెలువరించనున్నట్లు మొదట కోర్టు ప్రకటించింది. అయితే వేల కొద్ది పత్రాలు, ఇతర అంశాలు ఉండటంతో డిసెంబర్ 32కు, అనంతరం మార్చి 9వ తేదీకి వాయిదా పడింది. మార్చి 9న న్యాయవాదుల సమ్మె ఉండటంతో నిందితుల తరఫు న్యాయవాదులు ఎవరూ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఏప్రిల్ 9కి వాయిదా పడింది.

Satyam scam case: Ramalinga Raju convicted

ఈ కేసులో నిందితులుగా సత్యం రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజు, మరో సోదరుడు సూర్యనారాయణ రాజు, సత్యం మాజీ చీఫ్ ఫైనాన్షియల్ వడ్లమాని శ్రీనివాస్, ఆడిటర్లు గోపాలకృష్ణన్, శ్రీనివాస్, సత్యం మాజీ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతి రాజు, శ్రీశైలం, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

2009 జనవరి 7న సత్యం కుంభకోణం బయటపడింది.

2009 జనవరి 9న సీఐడీ కేసు నమోదు చేసింది. అదే రోజు రామలింగ రాజు అరెస్ట్

నిందితులు.. రామలింగ రాజు, రామరాజు, సూర్యనారాయణ రాజు, వడ్లమాని, గోపాలకృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, రామకృష్ణ, వెంకటపతి రాజు, శ్రీశైలం, ప్రభాకర్
2009 ఫిబ్రవరి 16న సీబీఐ విచారణ ప్రారంభం
2011 నవంబర్ 4న రామలింగ్ రాజుకు సుప్రీం కోర్టు బెయిల్
2014 అక్టోబర్ 30 నుండి రెండుసార్లు తీర్పుపై వాయదా
2015 ఏప్రిల్ 9న తుది తీర్పు.

English summary
Satyam scam case: Ramalinga Raju convicted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X