6 నెలల నుంచి ఏ ఫుడ్ అందించారు, మెడికల్ రిపోర్ట్, జైన్ పిటిషన్‌పై కోర్టు
తీహర్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఊరట కలిగింది. తనకు జైలులో సరయిన ఆహారం దొరకడం లేదని పెట్టుకున్న ఆర్జీకి కోర్టు అంగీకరించింది.అతను మతపరమైన దీక్షలో ఉంటే అందుకు అనువైన ఆహారం అందించాలని తీహర్ జైలు అధికారులకు స్పష్టంచేసింది.అంతేకాదు గత 6 నెలల నుంచి జైన్‌కు ఏయే ఆహారం అందించారనే విషయంపై తమకు నివేదిక ఇవ్వాలని కోరింది. ఆ సమయంలో అతను దీక్షలో ఉన్నారా లేదా అనే అంశాన్ని మెన్షన్ చేయాలని స్పష్టంచేసింది.

ఆన్సర్ మీ..
తీహార్ జైలు అధికారులు రేపు గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు సమాధానం ఇవ్వాలని.. ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ కూడా తీసుకుంటామని పేర్కొంది. ఢిల్లీ జైలు నిబంధనలు 2018 ప్రకారం ప్రస్తుతం ఉన్న బరువు, ఎంఆర్ఐ స్కాన్ ఇతర పరీక్షలు రిపోర్టులను ఇవ్వాలి. ఒకవేళ ఎంఆర్ఐ స్కాన్ ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదో తెలియజేయాలని.. ఆయన ఏ వ్యాధితో బాధపడుతున్నారో చెప్పాలని కోరింది.

నో ఫుడ్, నో ట్రీట్‌మెంట్
జైలులో తనకు మత విశ్వాసాల మేరకు ఆహారం అందడం లేదన్నారు. వైద్య పరీక్షలు కూడా చేయడం లేదన్నారు. వసతులు లేవని, నిన్న పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఇవాళ కోర్టు స్పందించింది. సరయిన వైద్యం అందజేయాలని.. ఆహారం అందించాలని స్పష్టంచేసింది.

హెల్త్ ఇష్యూస్
సత్యేంద్ర జైన్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కోర్టు కూడా అన్నీ రకాల వైద్యం అందజేయాలని కోరిందని గుర్తుచేసింది.పడుకోవడంలో జైన్ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పలు సందర్భాల్లో ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిందని వివరించారు. దీంతో కోర్టు వైద్యం చేయించాలని కోరిందని తెలిపారు. నరాల సంబంధిత వ్యాధితో జైన్ బాధపడుతున్నారు. దీంతో అక్యుప్రెషర్ చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం దెబ్బతినడంతో గత 4 నెలల నుంచి ఆహారం సరికి తీసుకోవడం లేదని పార్టీ తెలిపింది. ఆలయం వెళ్లకుంటే ఆహారం తీసుకోరని.. అందుకే పళ్లను తీసుకుంటున్నారని తెలిపింది. కోర్టు ఆదేశాలతో అక్యుప్రెషర్ మసాజ్ కూడా వైద్యంలో భాగం అని తెలిపింది. ఇప్పుడు ఆహార విషయమై కోర్టు స్పందించింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications