‘జేపీ’ కస్టమర్లకు ఊరట: రూ.2వేల కోట్ల డిపాజిట్‌కు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: నోయిడాలోని జేపీ ఇన్ఫోటెక్ గృహ వినియోగదారులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అంతకుముందు విచారణ సందర్భంగా జేపీ ఇన్‌ఫ్రాటెక్‌పై చేపట్టిన దివాలా ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా, సోమవారం వెలువరించిన తీర్పులో అక్టోబర్ 27వరకు రూ.2000కోట్లను తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
అంతేగాక, ఆ కంపెనీ ఎండీని, ఇతర డైరెక్టర్లను దేశం విడిచి పారిపోకుండా నిర్బంధిస్తున్నట్లు పేర్కొంది. అయితే, డిపాజిట్ చేయాల్సిన రూ.2000కోట్ల కోసం భూమి విక్రయాలు లేదా ఐఆర్‌పీ అనుమతితో ఏ ప్రాపర్టీనైనా విక్రయించుకోవచ్చని అపెక్స్ కోర్టు తెలిపింది.

మేనేజ్‌మెంట్‌ను టేకోవర్ చేసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఏర్పాటు చేసిన తాత్కాలిక పరిష్కార ప్రొఫెషనల్(ఐఆర్‌పీ) బాడీని ఆదేశించింది. ఫ్లాట్ కొనుగోలుదారుల, క్రెడిటార్ల ప్రయోజనాలను ఎలా రక్షిస్తారో 45రోజుల్లో తమకు తెలుపాలంటూ ఐఆర్‌పీని ఆదేశించింది. ఈ మేరకు ఓ రిజల్యూషన్ ప్రణాళికను సమర్పించాలని కూడా తెలిపింది.
సుప్రీంకోర్టు సోమవారం జారీ చేసిన ఆదేశాల మేరకు జేపీ అసోసియేషన్స్ సిస్టర్ కంపెనీ జేపీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ, డైరెక్టర్లు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు. కాగా, సెప్టెంబర్ 4న ఈ కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ జారీ చేసిన దివాలా చట్ట విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications