వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంల ట్యాంపరింగ్: కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు

ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయంటూ బహుజన్‌ సమాజ్‌ పార్టీ దాఖలు చేసిన పిటీషన్‌ను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయంటూ బహుజన్‌ సమాజ్‌ పార్టీ దాఖలు చేసిన పిటీషన్‌ను గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఈవీఎంల విషయంలో కేంద్రం, ఈసీ తమ వాదనలు, సమాధానాలను మే 8లోపు నివేదిక రూపంలో అందించాలని ఆదేశించింది. భవిష్యత్‌లో ఈవీఎంలను ఉపయోగించొద్దంటూ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీఎస్పీ తరపున పిటీషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

SC notice to Union govt on EVM use without paper trail

ఒకవేళ ఈవీఎంలను ఉపయోగిస్తే ఓటరు వెరిఫికేషన్‌ పేపరు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈవీఎంలను తారుమారు చేసి ఒక పార్టీకే ఓట్లు పడే విధంగా మార్పులు చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఈసీ అన్ని రాజకీయ పార్టీలకు సవాలు విసిరిన సంగతి తెలిసిందే. మే మొదటి వారం నుంచి ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి చూపించాలంటూ సవాల్ చేసింది.

English summary
The Supreme Court on Thursday issued notices to the Union government among others on a petition challenging the use of EVMs without a paper trail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X