అమ్మాయి తెగువ: కొట్టేసింది, కాళ్లు పట్టుకున్నాడు

లక్నో: అమ్మాయిలను వేధించడానికి ఒక హద్దు అంటు ఉంటుంది. అదే శ్రుతిమించితే, అదే అమ్మాయి తిరగబడితే పరస్థితి వేరుగా ఉంటుంది. అమ్మాయి కోపాన్ని పోలీసు అధికారుల సైతం అడ్డుకోలేకపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ లోని ఒక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రతి రోజూ స్నేహితులతో కలిసి స్కూల్ కు వెళ్లేది. అయితే నిత్యం కొందరు అబ్బాయి అమ్మాయిల వెంటపడి వేధించడం మొదలు పెట్టారు. మొదట అమ్మాయిలు వారి దారిన వారు వెళ్లేవారు.

అయితే రానురాను అబ్బాయిలు శ్రుతిమించిపోయారు. బూతులు తిట్గడం మొదలు పెట్టారు. సహనం కొల్పోయిన ఒక అమ్మాయి ఎదురుతిరిగింది. అయినా ఆకతాయిలకు బుద్ధి రాలేదు. అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సహకారంతో ఇద్దరు అబ్బాయిల బైక్ లు అడ్డగించి వారిని పట్టుకుంది.

School girl Punished eve teaser in Uttar Pradesh

పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అయితే అమ్మాయి తాను అనుభవించిన క్షోభను కుటుంబ సభ్యులకు చెప్పింది. వారిని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తనను ఎక్కువగా వేధించిన యువకుడిని పట్టుకుంది.

చేతులతో పిడిగుద్దులు గుద్దింది. కాళ్లతో తన్ని దేహశుద్ది చేసింది. చివరికి షూ తీసుకుని అతని మీద దాడి చేసింది, అతని దగ్గర గుంజీలు తీయించింది. అతను కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాడు. ఈ తతంగం మొత్తం పోలీసు అధికారుల ముందే జరిగింది. అయితే ఆకతాయిలకు బుద్ధిరావాలని పోలీసులు సైతం అమ్మాయిని అడ్డుకోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+