స్కూల్ వ్యాన్ డ్రైవర్ మొబైల్ ఫోన్ లో వేల సంఖ్యలో అమ్మాయిలు, ఆంటీల ఫోటోలు, లీక్ !

చెన్నై/తేని: ప్రైవేట్ స్కూల్ కు చెందిన వ్యాన్ లు, బస్సులో చాలా మంది డ్రైవర్లు, వ్యాన్ లో పిల్లలను చూసుకోవడానికి యువకులు, ఆయాలు పని చేస్తున్నారు. ఇదే స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఓ వివాహిత మహిళ మీద కన్ను వేశాడు. ఒంటరిగా ఉన్న వివాహిత మహిళ అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి స్కూల్ వ్యాన్ డ్రైవర్ మొబైల్ ఫోన్ పరిశీలించి హడలిపోయారు.

తమిళనాడులోని తేని జిల్లాలోని రాయపన్ పట్టికి గ్రామంలో మురుగన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మురుగన్ కుటుంబ సభ్యులు చూపించిన సెల్వి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మురుగన్, సెల్వి దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు.

videorecord

మురుగన్ మేస్త్రీ పని చేస్తున్నాడు. మురుగన్ అతను పని చేస్తున్న చోటకి అతని భార్య సెల్విని కూలి పనికి పిలుచుకుని వెలుతున్నాడు. ప్రతిరోజు మురుగన్, అతని భార్య రాయన్ పట్టి గ్రామంలోని కలానీ వీధిలో నుంచి పనికి వెళ్లి సాయంత్రం అదే వీధి నుంచి ఇంటికి చేరుకుంటున్నారు. ఇదే గ్రామంలో జయచంద్రన్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ లో జయచంద్రన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మురుగన్ భార్య సెల్వి పనికి వెళ్లి వచ్చే సమయంలో స్కూల్ వ్యాన్ డ్రైవర్ జయచంద్రన్ పదేపదే అతని మొబైల్ ఫోన్ లో ఫోటోలు తియ్యడం మొదలుపెట్టాడు. వివాహం అయిన మహిళ ఫోటోలు తియ్యడం తప్పు అంటూ సెల్వి భర్త మురుగన్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ జయచంద్రన్ కు చెప్పాడు.

police
అయితే జయంద్రన్ పద్దతి మార్చుకోకుండా పదేపదే సెల్వి ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. విసిగిపోయిన మురుగన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జయచంద్రన్ ను అరెస్టు చేసి అతని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. స్కూల్ వ్యాన్ డ్రైవ్ జయచంద్రన్ మొబైల్ ఫోన్ లో 150 మంది మహిళలతో పాటు సుమారు 1, 600 మంది స్కూల్ అమ్మాయిలు, యువతుల ఫోటోలు ఉండటం, వాటిలో అశ్లీల ఫోటోలు కూడా ఉండటంతో పోలీసులు హడలిపోయారు.

స్కూల్ వ్యాన్ డ్రైవర్ జయచంద్రన్ మొబైల్ ఫోన్ లోని ఫోటోలు సోషల్ మీడియాలో ఏమైనా అప్ లోడ్ అయ్యాయా ? అని ఆరా తీస్తున్నామని తేని సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు తెలిపారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్న జయచంద్రన్ ప్రతిరోజు స్కూల్ లో ఫ్రీగా తిరుగుతుండటంతో ఆ స్కూల్ లో చదువుతున్న అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+