Secret room: బంగ్లాలో భూమి మీద కనపడని సీక్రేట్ రూమ్, 26 మంది లేడీస్ తో ?, సినిమాల్లో చాన్స్ లేక?

ముంబాయి: విలాసవంతమైన బంగ్లాలో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్న వారిని అరెస్టు చెయ్యాలంటే కచ్చితంగా కస్టమర్లు చిక్కాలని పోలీసులు పసిగట్టారు. ఓ పోలీసును కస్టమర్‌గా బంగ్లా లోపలికి పంపించారు. తరువాత కూడా పోలీసులకు క్లూ చిక్కలేదు. కస్టమర్ లాగా బంగ్లాలోకి వెళ్లిన పోలీసు బయటకు వచ్చి అక్కడ ఏమీ జరగడం లేదు సార్ అని పై అధికారికి చెప్పాడు.

ఎక్కడో ఏదో తేడా కొడుతోందని తెలుసుకున్న పోలీసులు బంగ్లాలోకి వెళ్లి సోదాలు చేశారు. భూమి బయటకు కనపడని ఓ సీక్రేట్ రూమ్ లోని 26 మంది అమ్మాయిలు, ఆంటీలు బయటకు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఏసీ ఉన్న సీక్రేట్ రూమ్ లో మొత్తం తంతంగా నడుస్తోందని బయటకు వచ్చింది.

విలాసవంతమైన బంగ్లాలో

విలాసవంతమైన బంగ్లాలో

ముంబాయిలోని లామింగ్టన్ రోడ్డులోని ఓ బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో లో ఫ్యామిలీ నివాసం ఉండటం లేదని, ఆ బంగ్లాలో 20 మందికి పైగా యువతులు, మహిళలు ఉన్నారని, వివిధ రాష్ట్రాల నుంచి వారిని ఆ బంగ్లాకు తీసుకొచ్చి హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా ముంబాయి పోలీసులు రంగంలోకి దిగారు.

చిన్న క్లూ కూడా చిక్కలేదు

చిన్న క్లూ కూడా చిక్కలేదు

కస్టమర్లు అతని కచ్చితంగా తెలిస్తేనే పోలీసులు అరెస్ట్ చేయగలరు. ఓ పోలీసును కస్టమర్‌గా బంగ్లా లోపలికి పంపించారు. తరువాత కూడా పోలీసులకు క్లూ చిక్కలేదు. కస్టమర్ లాగా బంగ్లాలోకి వెళ్లిన పోలీసు బయటకు వచ్చి అక్కడ నలుగురు మాత్రమే ఉన్నారని, 20 మంది మహిళలు కనపడటేదని అతనిపై అధికారికి చెప్పాడు. పోలీసులకు అనుమానం మాత్రం తగ్గలేదు. పోలీసులు బంగ్లాలోకి వెళ్లి సోదాలు చేశారు.

జుట్టు పీక్కున్న పోలీసులు.... చివరికి అందరూ షాక్

జుట్టు పీక్కున్న పోలీసులు.... చివరికి అందరూ షాక్

బంగ్లాలోని అన్ని గదులు పరిశీలించారు. ఆ బంగ్లాలోని కబోడ్స్, బెడ్ రూమ్ లో మంచాల కింద పరిశీలించారు. గోడలు గీకినా, అన్ని రూమ్ లు వెతికినా, ఎటువైపు తిరిగినా 4 మంది మహిళలు మాత్రమే ఆ బంగ్లాలో ఉండటంతో పోలీసులంతా అయోమయంతో జుట్టు పీక్కున్నారు. రాంగ్ ఇన్ఫ్మరేషన్ వచ్చిందని పోలీసులు అనుకున్నారు. ఇక బంగ్లా నుంచి బయటకు వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో సోఫా సెట్ కింద ఓ సీక్రెట్ రూమ్ ఉందని పోలీసులు గుర్తించారు. సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్ అయ్యారు.

సీక్రేట్ రూమ్ లో 26 మంది మహిళలు

సీక్రేట్ రూమ్ లో 26 మంది మహిళలు

బంగ్లాలోని సీక్రేట్ రూమ్ లో నుంచి 26 మంది అమ్మాయిలు, ఆంటీలు బయటకు రావడంతో ముంబాయి పోలీసులు షాక్ అయ్యారు. ఏసీ ఉన్న సీక్రేట్ రూమ్ లో 26 మంది ఉన్నారని గుర్తించిన పోలీసులు కొంచెం సేపు షాక్ అయ్యారు. అంతకు ముందు బంగ్లాలోని హాల్ ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన నలుగురిలో ముగ్గురు మహిళలే ఉన్నారని పోలీసులు అన్నారు.

బంగ్లాలో భూమి మీద కనపడని సీక్రేట్ రూమ్

బంగ్లాలో భూమి మీద కనపడని సీక్రేట్ రూమ్

సౌత్ ముంబైలోని ముంబై లామింగ్టన్ రోడ్‌లోని బంగ్లాలో అండర్‌గ్రౌండ్ లో సీక్రేట్ రూమ్ ఉందని వెలుగు చూడటం ఇప్పుడు ముంబాయిలో హాట్ టాపిక్ అయ్యింది. భవనంలో సీక్రెట్ ఛాంబర్‌ను నిర్మించారని పోలీసులు అన్నారు. బయటి నుంచి చూస్తే అది సాధారణ బంగ్లాలా కనిపిస్తోందిని, లోపల హైటెక్ వ్యభిచారం జరుగుతోందని పోలీసు అధికారులు అన్నారు. ఈకేసులో ప్రస్తుతం నలుగురుని పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసుల వెళ్లే ముందు చాకచక్యంగా 10 మంది అక్కడికి నుంచి పారిపోయారని తెలిసింది.

ఇలాంటి బంగ్లాలో హైటెక్ వ్యభిచారం చేస్తూ నటీమణులు చిక్కారు

ఇలాంటి బంగ్లాలో హైటెక్ వ్యభిచారం చేస్తూ నటీమణులు చిక్కారు

గతంలో ముంబాయిలో ఓ బంగ్లాలోకి ప్రవేశించి రైడ్ చేసిన పోలీసులు ఐదు మందిని అరెస్టు చేశారు. ఈ 5 మందిలో ఒకరు బంగ్లా యజమాని, ఇద్దరు వ్యక్తులు బ్రోకర్లు, మరో ఇద్దరు మహిళలు నటీమణులు ఉన్నారు. ఆ ఇద్దరు తమిళ నటీమణులు. ఇద్దరు పలు తమిళ సినిమాల్లో నటించారు. తమకు సినీరంగంలో మార్కెట్‌ లేదని, చేతిలో సినిమా లేవని, డబ్బులేక మా ఫ్యామిలీలను పోషించుకోలేకపోతున్నామని ఇద్దరు ప్రముఖ నటీమణులు వ్యభిచార వృత్తిలోకి దిగామని పోలీసులకు చెప్పారు.

నటీమణులపై మాత్రమే కేసు నమోదు చేసిన పోలీసులు, వారి పేర్లను బయటపెట్టేందుకు నిరాకరించారు.. కానీ ముంబాయిలో తమిళ నటీమణులు అరెస్టు కావడం అప్పట్లో మీడియాలో చర్చనీయాంశమైంది.. ఇప్పుడు మళ్లీ అదే ముంబాయిలో వ్యభిచార ముఠా పట్టుబడటం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+