అరెస్టయిన మంత్రి హెల్త్ బులెటిన్: బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది
చెన్నై: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల అరెస్ట్ అనంతరం తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులు పొన్ముడి, అన్బిల్ మహేష్ సహా డీఎంకేకు చెందిన పలువురు సీనియర్ నాయకులు పరామర్శించారు.
కొద్దిసేపటి కిందటే ఆయనకు డాక్టర్లు కొరొనరీ యాంజియోగ్రామ్‌ను నిర్వహించారు. గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. దీనికోసం వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఈ ఉదయం 10:40 నిమిషాలకు సెంథిల్ బాలాజీకి కొరొనరీ యాంజియోగ్రామ్ నిర్వహించామని, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ఇబ్బందులతో ఆయన బాధపడుతున్నారని పేర్కొన్నారు.

దీన్ని నివారించడానికి ఆయనకు కొరొనరీ ఆర్టెరి బైపాస్ గ్రాఫ్ట్ (సీఏబీజీ)- బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. వీలైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. దీని కోసం సెంథిల్ బాలాజీని కార్పొరేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అపోలో ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేస్తారనే సమాచారం.
కాగా- సెంథిల్ బాలాజీ అరెస్ట్ వ్యవహారం రాజకీయ విమర్శలకు దారి తీసింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే- బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటోన్నారు. సెంథిల్ బాలాజీ అరెస్ట్ పట్ల డీఎంకే చేస్తోన్న విమర్శలను వారు తిప్పికొడుతున్నారు. ఈడీ అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారని తేల్చి చెబుతున్నారు.
మంత్రి అరెస్ట్‌తో తమిళనాడులో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదికి వచ్చారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. సెంథిల్ బాలాజీ సొంత అసెంబ్లీ నియోజకవర్గం కరూర్‌లో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ర్యాలీ తీశారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications