బెంగళూరు ఎయిర్ పోర్టు రోడ్డు ఫ్లైఓవర్ మీద స్కార్పియో టైర్ పగిలింది: ఇద్దరి దుర్మరణం !

ఎయిరోపోర్టు రోడ్డులో వేగంగా వెలుతున్న స్కార్పియో కారు ఫ్లైఓవర్ మీద కారు టైర్ పేలిపోయింది, లారీ, టెంపోకు ఢీ వన్ వేలోకి దూసుకు వెళ్లిన కారు, ఇద్దరి దుర్మరణం, ఏడు మందికి గాయాలు

బెంగళూరు: వేగంగా వెలుతున్న స్కార్పియో కారు టైర్ పగిలిపోవడంతో వన్ వేలోకి దూసుకు వెళ్లి మూడు వాహనాలను ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని హుణసమారనహళ్ళి ప్రాంతం సమీపంలో జరిగింది.

కెంపేగౌడ అంతర్జాతీయ విమనాశ్రయం రోడ్డు (జాతీయ రహదారి 7)లోని హుణసమారనహళ్ళి సమీపంలోని ఫ్లైఓవర్ మీద శుక్రవారం స్కార్పియో కారు వేగంగా వెలుతోంది. ఆ సందర్బంలో కారు టైర్ పేలిపోయింది. కారు అదుపుతప్పి డివైడర్ ను డీకోని వన్ వేలోకి దూసుకు వెళ్లింది.

Series of accidents near Kempegowda International Airport 2 dies

వన్ వేలో ఎదురుగా వేగంగా వస్తున్న బ్లూడార్ట్ డీహెచ్ఎల్ కొరియర్ సంస్థ టెంపో, లారీ, మరో వాహనాన్ని స్కార్పియో కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ఏడు మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో ఎయిర్ పోర్టు రోడ్డులో వాహన సంచారం అస్థవ్యస్తం అయ్యింది. చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట తాలుకా హండిగనాళ గ్రామాస్తులు స్కార్పియో కారులో వెలుతున్నారని చిక్కజాల ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+