కేరళలో ఒకే చోట ఏడు అనకొండలు (వీడియో)
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం జంతు ప్రదర్శన శాలలో అనకొండలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఒకే సారి ఒకే చోట ఏడు పచ్చరంగులో ఉన్న అనకొండలను చూసిన పర్యాటకులు థ్రిల్ కు గురౌతున్నారని జంతు ప్రదర్శన శాల అధికారులు అంటున్నారు.
పర్యాటకులను ఆకట్టుకోవడానికి తిరువనంతపురం జంతు ప్రదర్శ శాల అధికారులు శ్రీలంకలోని దేహివాల జంతు ప్రదర్శన శాల నుంచి ఏడు పచ్చటి అనకొండలు తీసుకు వచ్చారు. వాటిని పర్యాటకులు చూడటానికి అవకాశం కల్పించారు.

అందులో ఆరు ఆడ అనకొండలు ఉన్నాయి. రెండు సంవత్సరాల వయస్సు ఉన్న ఒక మగ ఆనకొండ ఉంది. అనకొండలను ప్రదర్శనకు అందుబాటులోకి తీసుకు వచ్చిన తరువాత జంతు ప్రదర్శన శాలకు ఆదాయం ఎక్కువ అయ్యిందని అక్కడి అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications