ఎయిర్ హోస్టెస్ లతో వ్యభిచారం: ప్రముఖ హోటల్ నిర్వాకం
ఏ రాష్ట్రంలో చూసినా ప్రధాన ప్రాంతాలు , ప్రముఖ హోటల్స్ హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలను యధేచ్చగా నిర్వహిస్తూ అశ్లీల దందా కొనసాగిస్తున్నారు కొందరు అక్రమార్కులు. మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ ప్రాంతంలో హైటెక్ వ్యభిచారానికి పాల్పడుతున్న హైటెక్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

నాగపూర్ లో ఓయో హోటల్ కేంద్రంగా ఎయిర్ హోస్టెస్‌లతో వ్యభిచారం
గతంలో అమీర్ పేటలోని ధరమ్ కరమ్ రోడ్డు లో ఓయో టౌన్ విల్లా హోటల్లో గుట్టుచప్పుడుగా జరుగుతున్న వ్యభిచార దందా బట్టబయలు అయిన విషయం తెలిసిందే . ఇక తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ లో ఓయో హోటల్ కేంద్రంగా ఎయిర్ హోస్టెస్‌లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రకారం సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. పోలీసులు నకిలీ విటుడి వేషంలో ఒకరిని పంపి మొత్తం గ్యాంగ్ ను ట్రాప్ చేశారు.

సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలో హోటల్ .. ముగ్గురు నిర్వాహకుల అరెస్ట్
విశ్వసనీయ సమాచారం మేరకు హోటల్ పై దాడి చేసిన పోలీసులు పక్కా స్కెచ్ తో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు .నాగ్‌పూర్‌లోని సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలో ఉన్న ఓయో హోటల్ లో సెక్స్ దందా నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు . తుషార్ అలియాస్ సుల్తాన్ పరస్వానీ, నీలేష్ నాగ్‌పురె, రజత్ డోంగ్రే అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరింత లోతుగా ఈ కేసును విచారిస్తున్నారు.

గతంలోనూ సెక్స్ దందా చేసి జైలుకు వెళ్ళిన తుషార్
ఇక ఈ గ్యాంగ్ లో మెయిన్ లీడర్ , నిర్వాహకుడు అయిన తుషార్ 2018లో కూడా ఇదే ఆరోపణలపై జైలుకెళ్లాడు. అయినప్పటికీ మళ్ళీ ఈ దందా కొనసాగిస్తున్నారు.ఇక ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్న తుషార్ కు కలకత్తా కు చెందిన ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయి. ఇక ఎయిర్ హోస్టెస్ తమ విధుల్లో భాగంగా ఈ హోటల్స్ లో బస చేసిన సమయంలో వీరికి విటులను పంపి దందా నిర్వహిస్తున్నారు తుషార్ .

నకిలీ విటుడ్ని పంపి ముఠాను పట్టుకున్న పోలీసులు
ఇక వీరి ద్వారా వ్య్వభిచారం చేస్తున్న ఎయిర్ హోస్టెస్ లను ఇద్దరిని కాపాడి వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఇక ఈ వ్యవహారంలో పక్కా ప్లాన్ తో పోలీసులు దాడులు చేసి వీరిని పట్టుకున్నారు. ఒక నకిలీ విటుడిని పంపి అతని ద్వారా ఎయిర్ హోస్టెస్ లను పిలిపించి, నిర్వాహకులను సైతం నిఘా పెట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహా దందాలు ప్రముఖ హోటల్స్ కేంద్రంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications