డ్రగ్స్ ఇచ్చి విద్యార్థినులపై హాస్టల్ అధికారుల లైంగిక వేధింపులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: విద్యార్థినులకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు హాస్టల్ అధికారులు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ దాష్టీకాలపై ఓ బాలిక సాహసించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

హాస్టల్ లో ఉంటూ విద్యనభ్యసిస్తున్న బాలికలను కంటికి రెప్పలా కాపాడాల్సిన హాస్టల్ అధికారులే కామపిశాచాలుగా మారారు. బాలికలకు బలవంతంగా డ్రగ్స్ ఇంజెక్షన్లు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తమ మాట వినని వాళ్ళను తీవ్రంగా కొట్టేవారని బాలిక ఫిర్యాదు చేసింది.

Sexual harassement in governament hostel at Delhi.

ఈ దాష్టీకాలపై ఓ బాలిక సాహసించి ఫిర్యాదు చేసింది. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బాలికల వసతి గృహంలో ఈ దారుణం చోటు చేసుకొంది. హస్టల్లోని ఓ స్టాఫ్ మెంబర్ ఘాతుకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తే తనను రోజుల తరబడి పస్తులుంచారని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుతో ధైర్యం తెచ్చుకొన్న మరో 9 మంది బాలికలు కూడ తమపై జరుగుతున్న అకృత్యాలను ఏకరువు పెట్టారు. ఈ మేరకు ఢిల్లీ మహిళా కమిషన్ కు లేఖ రాశారు. ఈ మేరకు డిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ బాధితుల నుండి వివరాలు సేకరించారు.అనంతరం బాలికలపై అకృత్యాలకు పాల్పడిన హాస్టల్ సిబ్బందిపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ విషయమై తాను రెండోసారి హాస్టల్ ను సందర్శించినప్పుడు బాలికలను కలుసుకోకుండా గదికి తాళం వేసి అడ్డుకొన్నారని ఆమె ఆరోపించారు. బాలికలకు ఆక్సిటోసిన్ తరహా డ్రగ్స్ ఇచ్చేవారని వెల్లడైందని అదికారులు చెబుతున్నారు. మమిళలపై అత్యాచారాలు జరిపేందుకు వారిని వేశ్యగృహాలకు అమ్మేందుకు నిషేధిత ఆక్సిటోసిన్ ఇస్తుంటారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sexual harassement in governament hostel at Delhi.A girl complaint against hostel officers to police.Delhi mahila commission members and police enquired about incident.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి