Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లేడీ రిసెర్చ్ స్కాలర్‌పై గైడ్ లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ: పీహెచ్ డీ చేస్తున్న విద్యార్థిని మీద లైంగిక వేధింపులు జరిగిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోప్రసిద్ధి చెందిన యూనివర్శికి చెందిన సెంట్ స్టీఫెన్స్ కళాశాలలో లైంగిక వేధింపులు జరడంతో విద్యార్థులు హడలి పోతున్నారు.

ఈ కళాశాలలోని కెమిస్ట్రీ విభాగంలో అసిస్టెంట్ ప్రోఫసర్ గా పని చేస్తున్న సతీష్ కుమార్ దగ్గర ఒక విద్యార్థిని పీహెచ్ డీ చేస్తున్నది. ఆ విద్యార్థినికి సతీష్ కుమార్ గైడ్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తనను 2013వ సంవత్సరం నుండి సతీష్ కుమార్ వేదిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నది.

ఈ విషయంపై అతనికి ఎన్ని సార్లు నచ్చ చెప్పినా ఫలితం లేకపోయిందని అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కాలేజ్ ప్రిన్సిపల్ వాల్సన్ తంపూకు ఫిర్యాదు చేశాని అయినా పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తున్నది.

Sexual Harassment Case Against Assistant Professor in Delhi

చివరికి పీహెచ్ డీ పూర్తి కావాలంటే చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ప్రిన్సిపల్ వాల్సన్ తంపూ సూచించారని అంటున్నది. తన తల్లిదండ్రులు జోక్యం చేసుకుని సతీస్ కుమార్ తో మాట్లాడారని, ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటానని, క్షమించాలని చెప్పాడని విద్యార్థిని చెప్పింది.

అయితే సతీష్ కుమార్ ఎప్పటిలాగే తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు 7 పేజీల ఫిర్యాదును పోలీసులకు ఇచ్చింది. కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం ఆయన మీద వచ్చిన ఆరోపణలను ఖండించారు. బాధితురాలి ఫిర్యాదును కాలేజ్ అంతర్గత ఫిర్యాదుల కమిటి పరిశీలిస్తున్నదని వివరించారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+