ఓయ్.. రోహిత్ శర్మ ఎప్పుడైనా నీ పొట్ట చూసుకున్నావా ?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వివాదాస్పద కామెంట్స్ చేశారు.రోహిత్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమ మహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్ శర్మపై షమ మహ్మద్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడు. ఒక ఆటగాడు అలా ఉండకూడదు. రోహిత్ వెంటనే బరువు తగ్గాలి. ఇప్పటి వరకు ఆకర్షనీయంగా కనపడని ఏకైక భారత కెప్టెన్ రోహిత్ శర్మనే అంటూ షమ మహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.రోహిత్ శర్మపై షమ చేసిన వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుగతా రాయ్ సైతం తన మద్దతు తెలిపారు. రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పని కాడని, కనీసం జట్టులో స్థానానికి కూడా అతను అర్హుడు కాదని సుగతా రాయ్ విమర్శలు గుప్పించారు. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు రోహిత్ శర్మపై చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

రాజకీయాల్లోకి క్రీడాకారులను లాగొద్దని, ఆ పోస్టును డిలీట్ చేయాలంటూ షమకు అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ తగదని, క్రికెట్ జట్టు కెప్టెన్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నీచమని క్రికెట్ పండితులు మండిపడుతున్నారు.ఈ ఘటనపై బీజేపీ రియాక్ట్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలు వల్ల వారు దేశం కోసం చేసిన కృషి, త్యాగాలను తక్కువగా చేస్తాయని చెప్పారు. ప్రపంచకప్ గెలిచిన నాయకుడిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. దీనిపై ఇంత వివాదం చేలరేగుతునప్పటికీ షమ మహ్మద్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం లేదు. తాను చెప్పిన దాంట్లో ఏం తప్పుందని ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications